Moviesఇంత దారుణ‌మా… త‌న‌కంటే చిన్నోడితో రొమాన్స్ మొద‌లు పెట్టిన‌ అంజ‌లి…!

ఇంత దారుణ‌మా… త‌న‌కంటే చిన్నోడితో రొమాన్స్ మొద‌లు పెట్టిన‌ అంజ‌లి…!

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సినిమా ఎప్పుడు ? వస్తుందా అని ఎదురుచూసే యూత్ చాలామంది ఉన్నారు. జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా నవీన్ పోలిశెట్టి సూపర్ పాపులర్ అయిపోయాడు. ఆ సినిమాతో నవీన్ కు తెలుగు లేని ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత చేస్తున్న మిస్టర్ పోలిశెట్టి సినిమా దాదాపు పూర్తి అయింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత నవీన్ నటించిన సినిమా సితార సంస్థలో తెరకెక్కనుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తోంది. ఈ సినిమాలో నవీన్ కి జోడిగా నటించే ఇద్దరు హీరోయిన్ల ఎంపిక కూడా దాదాపు పూర్తయింది. అనగనగా ఒక రాజు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక హీరో పాత్ర పేరు రాజు కనుక.. ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారు. డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న నేహాశెట్టి.. ఇక సీనియర్ హీరోయిన్ అంజలి ఇద్దరు నవీన్ పోలిశెట్టి సరసన నటించబోతున్నారు.

విచిత్రం ఏంటంటే అంజలి ఈ సినిమాకు ఓకే చెప్పడాన్ని బట్టి చూస్తే.. అవకాశాలు లేకపోవడంతో ఆమె చివరకు చిన్నాచితకా హీరోలకు కూడా ఒకే చెప్పేస్తోంది. వయసులో అంజలి కంటే నవీన్ చాలా చిన్నోడు. అయినా అతనితో రొమాన్స్ చేసేందుకు అంజలి ఓకే చెప్పేసింది. ఇటీవల అంజలికి తెలుగులో సరైన అవకాశాలు రావడం లేదు. ఇలాంటి టైంలో వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకూడదని.. ఆమె నవీన్ పోలిశెట్టి లాంటి చిన్న హీరో.. అందులోనూ వయసులో తనకంటే చిన్నోడుతో రొమాన్స్ చేసేందుకు సై అన్నట్టు తెలుస్తోంది.

కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. జాతి రత్నాలు సినిమా తర్వాత మళ్లీ ఫుల్ ఎనర్జీతో నవీన్ ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాడని ఇండస్ట్రీలో చర్చ అయితే నడుస్తోంది. చివ‌ర‌కు అవ‌కాశాల కోసం ఆవురావురుమంటోన్న అంజ‌లీ ద‌శ ఈ సినిమాతో అయినా తిరుగుతుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news