Moviesపొన్నియిన్ సెల్వన్ 2 పబ్లిక్ టాక్: మణిరత్నం ఇంత బోల్డా.. చెమటలు...

పొన్నియిన్ సెల్వన్ 2 పబ్లిక్ టాక్: మణిరత్నం ఇంత బోల్డా.. చెమటలు పట్టించేసాడు కదరా బాబు..!!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న మణిరత్నం డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన సినిమా పోనియన్ సెల్వన్ పార్ట్ 1 . ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి ఎలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . దాదాపు 550 కోట్లకు పైగానే కలెక్ట్ చేసే సినిమా ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది . ఈ సినిమా కి పార్ట్ 3 రాబోతుందని అప్పుడే చెప్పుకొచ్చాడు డైరెక్టర్. కాగా నేడు గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన పోనియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

తమిళ బాహుబలి గా చెప్పుకుంటున్న పోనియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే పార్ట్ వన్ తో కంపేర్ చేస్తే పార్ట్ 2 సినిమా ఇంకా బాగుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరి ముఖ్యంగా పిరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా విషయంలో మణిరత్నం చాలా కేర్ఫుల్ గా డీల్ చేశాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమాకి ఐశ్వర్యరాయ్- త్రిష – ఐశ్వర్య లక్ష్మి -శోబితా ధూళిపాల అందాలు మరింత ప్లస్ గా మారాయి . అంతేకాదు ఈ కథను మొత్తం కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందించాము అంటూ స్వయంగా మణిరత్నం ఒప్పుకున్నారు.

కథ గురించి చెప్పాలంటే రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు చోళనాడు యువరాజు అరుణ్మోజి వర్మన్ ని చంపాలనుకుంటారు. ఆ యువరాజును కాపాడే బాధ్యత వల్లవరాయన్(కార్తీ) తీసుకుంటారు ఇది మనం పార్ట్ 1 లో చూశాం.. సముద్రంలో ప్రత్యర్ధులతో జరిగిన యుద్ధంలో అరుణ్మోజి( జయం రవి) మరణించాడని అందరు భావిస్తారు. అరుణ్మోజి మరణానికి ప్రతీకారంగా ఆదిత్య కరికాలన్(విక్రమ్) ఏం చేశాడు అనేది అసలు పార్ట్ కధ ? అసలు చోళులపై నందిని(ఐశ్వర్య రాయ్) పగ ఎందుకు పెంచుకున్నారు అనేది అసలు ట్విస్ట్ ? ఆదిత్య కరికాలుడిని చంపి, చోళనాడును ఆమె ఎందుకు నాశనం చేయాలనుకుంటుంది అనేది తెలుసుకున్న ప్రతి ఒక్క అభిమాని ఈ సినిమాని ఫీల్ అవుతారు.

పార్ట్ వన్ తో కంపేర్ చేస్తే పార్ట్ 2 లో మంచి సీన్స్ పడ్డాయని చెప్పాలి . అంతేకాదు పార్ట్ వన్ లో విక్రమ్ – ఐశ్వర్యరాయ్ కు పెద్ద ప్రాధాన్యత లేదు. కానీ పార్ట్ 2 లో మాత్రం కథ మొత్తం వీళ్ళ పైన నడుస్తుంది . అదిరిపోతుంది . మరి ముఖ్యంగా ఎక్కడ నెగటివ్ అనేది లేకుండా చూసుకున్నాడు డైరెక్టర్. అయితే కథ చాలా నెమ్మదిగా నడవడంతో జనాలకు కూసింత బోర్ ఫీలింగ్ కలుగుతుంది .. ఇది తప్పిస్తే ఇంకెక్కడ కూడా నెగటివ్ పాయింట్స్ లేవు. కచ్చితంగా ఈ సినిమా తమిళ జనాలకు బాగా నచ్చేస్తుంది . అయితే మిగతా భాష జనాలకు ఎంతవరకు నచ్చుతుందో కాన్ఫిడెంట్గా చెప్పలేం . ఈ క్రమంలోనే పార్ట్ వన్ 550 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా పార్ట్ 2 ఎలాంటి రికార్డ్స్కొల్లగొడుతుందో అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . మొత్తానికి మణిరత్నం క్లాసిక్ రొమాన్స్ తో కూడా చెమటలు పట్టించి హిట్ కొట్టాడనే చెప్పాలి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news