Moviesమౌనిక‌ను ముందే కోడ‌లిగా చేసుకోవాల‌నుకున్న మోహ‌న్‌బాబు ఏం చేశాడు.. ఇన్నాళ్ల‌కు బ‌య‌ట...

మౌనిక‌ను ముందే కోడ‌లిగా చేసుకోవాల‌నుకున్న మోహ‌న్‌బాబు ఏం చేశాడు.. ఇన్నాళ్ల‌కు బ‌య‌ట ప‌డ్డ నిజం..!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్.. కర్నూలు జిల్లాకు చెందిన దివంగత నేతలు శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంప‌తుల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డి ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. ఇరు కుటుంబాలు.. సన్నిహితుల సమక్షంలో మనోజ్ – మౌనిక ఒకటయ్యారు. వీరిద్దరిది పెళ్లికి ముందు 15 ఏళ్ల పరిచయం.. నాలుగేళ్ల ప్రేమ తర్వాత ఈ జంట పెళ్లితో ఒకటయ్యారు. తాజాగా మనోజ్ – మౌనిక కలిసి వెన్నెల కిషోర్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వీరిద్దరూ తమను తాము పరిచయం చేసుకొని తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముందుగా మనోజ్ మాట్లాడుతూ మా ఇద్దరి కుటుంబాలకు 15 ఏళ్లకు పైగా పరిచయం ఉందని.. అయితే అనుకోకుండా మా ఇద్దరి లైఫ్ లో చెరో దారిలో వెళ్ళాం.. ఆ తర్వాత నా కెరియర్ లో చాలా ఇబ్బందులు పడ్డా… ఆ తర్వాత మేము మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకునే వాళ్లమని మనోజ్ చెప్పాడు.

ఇక మౌనిక విషయంలో ఫస్ట్ నాకే ఆ ఫీలింగ్ వచ్చిందని.. ఒక రోజు తనతో నువ్వంటే ఇష్టమని ఓపెన్ గా చెప్పేసాను. నాకు మళ్ళీ హ్యాపీగా బతకాలని ఉంది.. నాకు కొత్త జీవితం నీవల్లే వస్తుంది.. నా జీవితం ఇలా ఉండటం నాకు నచ్చలేదు.. నువ్వు ఒప్పుకుంటే నాకు మంచి లైఫ్ దొరుకుతుంది… నిన్ను బాబును బాగా చూసుకుంటానని చెప్పానని మనోజ్‌ చెప్పాడు.

ఇక మౌనిక మాట్లాడుతూ గతంలో కూడా మంచు ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో వాళ్ళ ఇంటికి వెళ్లే దానిని అని.. మోహన్ బాబును తాను మామ అని ముద్దుగా పిలుస్తానని.. ఆయన స్వయంగా అన్నం కలిపి ఆయన చేతితో తనకు తినిపించిన సందర్భాలు ఉన్నాయని.. ఆప్యాయత, అనురాగాలను తాను ఎప్పటికీ మర్చిపోలేనని మౌనిక తెలిపింది.

ఇక తనకు అత్తమ్మ నిర్మలతో పాటు అక్క లక్ష్మీ ప్రసన్న ఎంతో సాయం చేశారని మౌనిక రెడ్డి తెలిపింది. ఇక అమ్మ బర్త్ డే రోజు మనోజ్ వస్తున్నాడు అన్న విషయం నాకు తెలియదు.. మనోజ్ రాడేమో అనుకున్నా.. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేను ఆయనను చూడగానే ఫుల్ ఎమోషనల్ అయ్యాను.. అంటూ ప్రేమతో పాటు తన జీవితంలో పడిన కష్టాలను మౌనిక పంచుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news