Moviesమౌనిక‌కు ఇంత‌లోనే అంత స‌ర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మనోజ్... మాట‌ల్లేవ్‌.. (వీడియో)

మౌనిక‌కు ఇంత‌లోనే అంత స‌ర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మనోజ్… మాట‌ల్లేవ్‌.. (వీడియో)

సినీ హీరో మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఇద్ద‌రికి ఇది రెండో పెళ్లి. మౌనిక‌కు మొద‌టి భ‌ర్త ద్వారా క‌లిగిన సంతానం ధైర‌వ్ రెడ్డి ఉన్నాడు. ఇక ఈ జంట త‌మ సంసారం జీవితం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికకు ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. త‌మ ఇద్ద‌రి ప్ర‌యాణంతో పాటు పెళ్లి విజువ‌ల్స్‌తో ఓ స్పెష‌ల్ సాంగ్ చేయించి మ‌రీ మౌనిక‌కు స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చాడు.

డెడికేటెడ్ టు మౌనిక అంటూ యూట్యూబ్ వేదికగా మ‌నోజ్ ఆ సాంగ్ రిలీజ్ చేశాడు. అందులో మంచు మనోజ్ ఆయన కుటుంబ సభ్యులతో పాటు మౌనిక ఫ్యామిలీ, అటు పెళ్లి వేడుకలు ఉన్నాయి. యేం మనసో యేం మనసో.. యేం వరసో యేం వరసో అంటూ సాగే ఈ పాట చాలా బ్ర‌హ్మాండంగా వ‌చ్చింది. హ‌ల్దీ మెహందీ ఫంక్ష‌న్స్ ఆ త‌ర్వాత పెళ్లి విజువల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి.

ఇక విజువ‌ల్స్‌తో పాటు సాంగ్ కూడా అదిరిపోయింది. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా… అచ్చు రాజమణి మ్యూజిక్ డైరెక్ట్ చేసి పాడ‌డం విశేషం. ఈ సాంగ్‌కు లార్డ్ శివ దర్శకత్వం వహిస్తున్నట్లు వీడియోలో వెల్లడించారు. సాంగ్‌తో పాటు విజువ‌ల్స్ అయితే మెస్మ‌రైజ్ చేస్తున్నాయి. వీడియో చివ‌ర్లో అంతా శివుడి ఆజ్ఞ అని వెల్ల‌డించారు.

ఈ వీడియో చూసిన ప్ర‌తి ఒక్క‌రు మనోజ్ – మౌనిక దంప‌తులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కలకాలం ఇలాగే హ్యాపీగా ఉండాల‌ని దీవిస్తున్నారు. ఈ వీడియో సాంగ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news