Moviesత‌న తాత పుట్టిన నిమ్మ‌కూరులో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఆస్తుల విలువ...

త‌న తాత పుట్టిన నిమ్మ‌కూరులో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఆస్తుల విలువ తెలుసా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో త్రిపుల్ ఆర్‌ లాంటి పాన్ ఇండియా సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో మరో భారీ పాన్‌ ఇండియా సినిమాకి కూడా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం వార్ 2 సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇలా ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఒక పార్టీలో ధరించిన వాచ్ ఖరీదు రు. 8 కోట్లు అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కూడా సినిమా సినిమాకు కళ్ళు చెదిరే రేంజ్ లో పెరుగుతుంది. తాజాగా ఎన్టీఆర్ గురించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. తన తాత సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కు కొన్ని ఆస్తులు వారసత్వంగా వచ్చాయట.

ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు అయినా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్‌కు ఐదు ఎకరాల ఆస్తి ఉందని… ఈ ఆస్తుల విలువ 7.50 కోట్ల రూపాయల నుంచి పది కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలిపాడు. నిమ్మకూరులో ప్రస్తుతం ఒక ఎకరా భూమి విలువ కోటిన్నర రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం.

ఇక ఎన్టీఆర్ హైదరాబాదు పరిసర ప్రాంతాలలో కూడా భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ నెల సంపాదన స్థిర‌, చరస్తులు ద్వారా రు. 10 కోట్ల రేంజ్ లో ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రు. 50 నుంచి 60 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. వార్ 2 సినిమాకు రు. 75 కోట్ల రెమ్యూనరేషన్ ఎన్టీఆర్‌కు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక తన తాత స్వగ్రామం నిమ్మకూరు అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం. అందుకే ఎన్టీఆర్ కెరియర్ ఆరంభంలోనే తన ఆంధ్రావాలా సినిమా ఫంక్షన్‌ను కూడా పట్టుబట్టి నిమ్మకూరులో కళ్ళు చెదిరే రేంజ్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news