Moviesజబర్దస్త్ యాంకర్ పరువు పాయే..మెగా హీరో టైమింగే టైమింగ్..దూల తీర్చేసాడు..!!

జబర్దస్త్ యాంకర్ పరువు పాయే..మెగా హీరో టైమింగే టైమింగ్..దూల తీర్చేసాడు..!!

వామ్మో .. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ యాక్టివ్ అని తెలుసు కానీ ఇంత యాక్టివా..? ఇంత జాలిగా ఉంటాడా ..? ఇంత చిలౌట్ అవుతూ ఉంటాడా ..? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ..? ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ పిక్స్ ని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫాన్స్ . కాగా సాయిధరమ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా విరుపాక్ష . ఏప్రిల్ 21న గ్రాండ్గా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమాలో సంయుక్త మీనన్ ఆయనకు జోడిగా నటించింది . చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా బుల్లితెరలోనే టాప్ టిఆర్పి రేటింగ్ సంపాదించుకునే జబర్దస్త్ ప్రోగ్రాంకు అటెండ్ అయ్యారు సాయిధరమ్ తేజ్ అండ్ విరుపాక్ష టీం. ఈ క్రమంలోనే జబర్దస్త్ లో తనదైన స్టైల్ లో నవ్వులు పూయించి సందడి సందడి చేశారు మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్.

స్టేజ్ పైకి రావడం రావడంతోనే అందంగా తయారైన సౌమ్యరావుని చూస్తూ “ఏంజెల్స్ రావడం ఫస్ట్ టైం చూస్తున్న “అంటూ కామెంట్ చేస్తాడు . దీంతో సౌమ్యరావు మెలికలు తిరిగిపోతున్న మూమెంట్లో “మీ గురించి కాదులేండి” అంటూ సంయుక్త మీనన్ చూసి నవ్వేస్తాడు . ఈ క్రమంలోనే ఆమె గాలి తీసేసినట్లయింది. ఆ తర్వాత కూడా తనదైన స్టైల్ లో మాట్లాడుతున్నప్పుడు పదే పదే పంచులు వేయడంతో సౌమ్య రావు కూసింత అసహనానికి లోనైనట్టే వీడియోలో క్లియర్గా తెలిసిపోతుంది.

మరీ ముఖ్యంగా రాకెట్ రాఘవ.. సాయిధరమ్ తేజ్ వచ్చినప్పుడు చేసినస్కిట్ ఓవర్ యాక్టింగ్ గా అనిపిస్తుంది . అంతేకాదు మిగతా స్కిట్స్ అంతా కూడా కూల్ గా సాఫీగా సాగిపోతున్న టైంలో సాయిధరమ్ చేత స్పెషల్ స్కిట్ వేయిస్తారు . ఈ క్రమంలోనే సౌమ్యరావును మరోసారి ఆడేసుకుంటాడు సాయిధరమ్ తేజ్ ..ఆయనను పొగిడే క్రమంలో ఆమెకు అతగాడి పేరు రాక ధర్మరాజు అంటూ టంగ్ స్లిప్ అవుతుంది.. ఈ క్రమంలోనే పకపక నవ్విన సాయిధరమ్ తేజ్ నవ్వుతూ..” ఇంకా మేలు యమధర్మరాజును చేయలేదు నన్ను” అంటూ నవ్వేస్తాడు

ఈ క్రమంలోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సౌమ్యరావ్ నే టార్గెట్గా తీసుకున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ . మిగతా టైం లో కత్తి తోపు అనుకునే సౌమ్యరావు ఈ ఎపిసోడ్లో మాత్రం బిస్కెట్ అయిపోయింది అందుకే సౌమ్యరావు పరువు పోయినట్లు అయింది . పూర్తి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కంప్లీట్ ఎపిసోడ్ చూడాలంటే ఏప్రిల్ 20 వరకు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news