Moviesఅప్ప‌టి స్టార్ హీరోయిన్ ' భానుప్రియ ' ఇప్పుడేం చేస్తుందో తెలిస్తే...

అప్ప‌టి స్టార్ హీరోయిన్ ‘ భానుప్రియ ‘ ఇప్పుడేం చేస్తుందో తెలిస్తే క‌న్నీళ్లు ఆగ‌వు…!

అవును.. ఒక‌ప్పటి హీరోయిన్ భాను ప్రియ ఇప్పుడు ఏం చేస్తోంది? ఎలా ఉంది? చాలా మంది ఇప్పుడు మ‌రి చిపోయిన భానుప్రియ ప్ర‌స్తుతం క‌ష్టాల్లో ఉన్న‌ట్టుగా.. ఇటీవ‌ల త‌మిళ సినీ మ్యాగ‌జైన్లు చెప్పుకొచ్చాయి. అచ్చ‌తెలుగు రాష్ట్రానికి చెందిన భానుప్రియ‌.. బ్లాక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నారు. ఏ పాత్ర‌నైనా.. అవ‌లీ ల‌గా పోషించేస్తారు. సుదీర్ఘ‌కాలం.. సినీ ప్రయాణం చేసిన అతి త‌క్కువ మంది హీరోయిన్ల‌లో భానుప్రియ ఒక‌రు.

భానుప్రియ తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోల‌తో న‌టించి ఎన్నో సూప‌ర్ హిట్లు ఇచ్చారు. అలాగే ఆమె కెరీర్ ప్రారంభంలో ఆమెను స్టార్ హీరోయిన్‌ను చేసిన ద‌ర్శ‌కుడు వంశీతోనూ ఆమె ప్రేమ‌లో ప‌డ్డార‌ని.. అయితే ఇద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డి కెరీర్‌ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌నే భానుప్రియ త‌ల్లి కోప్ప‌డ్డార‌ట‌. వంశీతో నువ్వు నీ భార్య‌కు అన్యాయం చేసిన‌వాడివి అవుతావ‌ని చెప్ప‌డంతోనే భానుప్రియ‌ను మ‌ర్చిపోలేక దూర‌మ‌య్యార‌ట‌.

ఎలా ఎదిగిందో అదే రేంజ్‌లో భానుప్రియ గ్రాఫ్ ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. వివాహానికి ముందు.. భానుప్రియ బాగానే సంపాయించుకుంది. త‌మిళ‌, క‌న్న‌డ‌, తెలుగు సినిమాల‌తో జోరు పెంచింది. అయితే.. వివాహం త‌ర్వాత‌.. ఇండ‌స్ట్రీకి దూర‌మైన భానుప్రియ.. త‌ర్వాత ఆర్థిక ఇబ్బందులు ప‌డిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, సెకండ్ ఇన్నింగ్స్‌లో త‌ల్లి పాత్ర‌లు.. వ‌దిన పాత్ర‌ల్లోనూ భాను ప్రియ న‌టించ‌డానికి కార‌ణం ఇబ్బందులేన ని అంటారు.

ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది చూస్తే.. కొన్ని సీరియ‌ళ్ల‌లో భానుప్రియ న‌టిస్తున్న ట్టు తెలుస్తోంది. అది కూడా.. త‌క్కువ రెమ్యూన‌రేష‌న్‌కు రోజువారీ ఒప్పుకొని షూటింగులు చేస్తున్న‌ట్టు స‌మాచారం . ప్ర‌స్తుతం భానుప్రియ‌ను ప‌ట్టించుకునేవారు క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఒక‌ప్పుడు.. ఇండ‌స్ట్రీని ఊపేసిన‌.. హీరోయిన్ల‌లో ముందు వ‌రుస‌లో ఉన్న భానుప్రియ‌.. ఇప్పుడు మాత్రం వెనుక‌బ‌డి పోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news