Moviesలిమిట్స్ క్రాస్ చేసిన హైపర్ ఆది..ఆడవాళ్ల నైటీల పై దారుణమైన కామెంట్స్.....

లిమిట్స్ క్రాస్ చేసిన హైపర్ ఆది..ఆడవాళ్ల నైటీల పై దారుణమైన కామెంట్స్.. మొగుడ్ల ఫీలింగ్ కూడా అదేనా..?

బుల్లితెరపై ఎన్ని షోలు ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి . వీక్ అంతా కష్టపడి వీకెండ్ కోసం ఎంజాయ్మెంట్ కోసం ఎదురు చూసే జనాలకు శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది . అఫ్కోర్స్ ఈ ప్రోగ్రాం లో జరిగేది అంత కల్పితమే అయినా సరే కొంతసేపు నవ్వుకోడానికి చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది . కొన్నిసార్లు లిమిట్స్ క్రాస్ చేసినా మరికొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ చేస్తూ సూపర్ గా ఆకట్టుకుంటున్నారు ..కమెడియన్స్ . ఈ క్రమంలోని శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

ఈ ప్రోమో మొత్తానికి హైపర్ ఆది చేసిన స్కిట్ హైలైట్ గా మారిపోతుంది అంటూ తెలుస్తుంది. ఆడవాళ్లు నిరంతరం వేసుకునే నైటీల కాన్సెప్ట్ తెరపైకి తీసుకు వచ్చిన హైపర్ ఆది తనదైన స్టైల్ నవ్వించి అభిమానులను సందడి చేశారు . ఈ క్రమంలోనే స్కిట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హైపర్ ఆది మాట్లాడిన మాటలు ఫన్నీగా అనిపించాయి . స్టార్టింగ్ నుంచి హైపర్ ఆది ఆడవాళ్ళ నైటీలపై కౌంటర్స్ వేస్తూ ఆకట్టుకున్నాడు . ఎంట్రీ తోనే లక్ష్మీనరసింహ సినిమాలోని బాలయ్య డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చాడు . “వచ్చిన మొగుళ్ళు వచ్చినట్టే పెళ్ళాల చేతుల్లో బలవుతూ ఉంటే .. ఈసారి వచ్చేవాడు బలయ్యే వాడు కాదు .. బలిచ్చేవాడు వచ్చాడు ” అంటూ బాలయ్య డైలాగ్ ను గుక్క తిప్పుకోకుండా చెప్పేసాడు.

స్కిట్లో డైలాగ్స్ చెప్పుతూ..” సంక్రాంతి పండక్కి.. ఉగాది పండుగకి.. కాస్ట్లీ కాస్ట్లీ చీరలు అడగడం కాదు.. ఎప్పుడూ ఒకే నైటీ వేసుకుని ఉంటారు ..అదేంటో తెలియదు పిల్లాడు ముక్కు చీదుతారు..కడుగుతారు ..అన్ని ఆ నైటీతీనే.. మళ్ళీ ఆ నైటీతోనే మా దగ్గరికి వస్తారు ” అంటూ ఫన్నీగా ఆ డైలాగ్ ని చెప్పుకొచ్చారు . అంతేకాదు ఆ తర్వాత కూడా ప్రభుత్వాన్ని మధ్యలోకి లాగుతూ ..”ప్లాస్టిక్లను కాదు సార్.. ఆ నైటీలను బ్యాండ్ చేయండి.. మీకు దండం పెడతా అంటూ వార్నింగ్ తో కూడిన రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆక్కడున్న ఆడవాళ్లు స్టేజ్ పైకి వచ్చి హైపర్ ఆదిని చితక్కొడతారు . ఇదంతా సరదాగా చేశారన్న విషయం అందరికీ తెలిసిందే . లేటెస్ట్ ప్రోమోలో ఇదే హైలెట్గా నిలిచింది . పూర్తి ఎపిసోడ్ వచ్చే ఆదివారం ఈటీవీలో ప్రసారం కానుంది అన్న విషయం తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news