Moviesశ్రీదేవి ముక్కుకు ఎన్ని ఆప‌రేష‌న్లా… దేశంలోనే ఇదో రికార్డు…!

శ్రీదేవి ముక్కుకు ఎన్ని ఆప‌రేష‌న్లా… దేశంలోనే ఇదో రికార్డు…!

ఆలిండియా నెంబ‌ర్‌-1 హీరోయిన్‌గా దేశంలోనేరికార్డు సృష్టించిన ఏకైక తెలుగు హీరోయిన్ శ్రీదేవి. అప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి ఒక‌రిద్ద‌రు బాలీవుడ్‌లోకి వెళ్లినా..శ్రీదేవి లాగా మాత్రం ఎవ‌రూ పేరు తెచ్చు కోలేదు. శ్రీదేవి అలా పేరు తెచ్చుకుంది. ఒక ప‌దేళ్ల‌పాటు ఎక్క‌డ విన్నా శ్రీదేవి పేరు మార్మోగింది. ఖుదాగ వా చిత్రం నుంచి మ‌రింత గా శ్రీదేవికి ఆఫ‌ర్లు పెరిగాయి. 1992లో వ‌చ్చిన ఖుదాగ‌వా.. శ్రీదేవి జీవితాన్ని మార్చేసింది.

అయితే.. శ్రీదేవికి కూడా బాలీవుడ్‌లో అంత ఈజీగా అయితే.. అవ‌కాశాలు రాలేదు. ఎందుకంటే.. ద‌క్షిణాది తార అయిన‌.. శ్రీదేవి.. ఆహార్యం బాగున్నా.. ఇంట‌ర్నేష‌న‌ల్ లెవిల్లో ఉండే.. బాలీవుడ్ సినిమాల‌కు ఆమె ఆహార్యం న‌ప్ప‌లేదు. దీంతో ఆమెఆకారంలో మార్పులు చేయాలంటూ.. ప‌ట్టుబ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే ముక్కు కోల‌గా ఉండేంద‌కు ఆప‌రేష‌న్లు చేయించుకున్నారు శ్రీదేవి. ఇలా.. మొత్తం 14 సార్లు ఆప‌రేష‌న్లు చేయించుకుంది.

అదే స‌మ‌యంలో ఆప‌రేష‌న్ చేయించుకున్న ప్ర‌తిసారీ.. ఆమె అసౌక‌ర్యానికి గుర‌య్యారు. అయితే.. తొలి నాళ్ల‌లో బాలీవుడ్‌లో ఆమెకు బోనీ క‌పూర్ సోద‌రులు ఎక్కువ‌గా అవ‌కాశం ఇచ్చారు. అందుకే..త‌ర్వాత కాలంలో బోనీ క‌పూర్‌ను ఆమె వివాహం చేసుకునే వ‌ర‌కు వారి ప‌రిచ‌యం.. సాగింద‌ని అంటారు. స‌రే.. ఏదేమైనా.. శ్రీదేవి.. ముక్కు ఆప‌రేష‌న్ వ్య‌వ‌హారం.. బాలీవుడ్‌లో ఒక రికార్డు.

ఇక‌, తెలుగు ఇండ‌స్ట్రీ నుంచే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన జ‌య ప్ర‌ద మాత్రం ఎలాంటి ఆప‌రేష‌న్లు లేకుండానే.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనేక సినిమాల్లో జ‌య‌ప్ర‌ద కూడా పేరు తెచ్చుకుంది. కానీ, శ్రీదేవి మాత్రం మొద‌ట్లో త‌డ‌బ‌డి.. త‌ర్వాత‌.. నెంబ‌ర్ 1 స్తాయికి ఎదిగింది. ద‌టీజ్ శ్రీదేవి. చాలా మందికి తెలియ‌ని విష‌యం ముంబైలో శ్రీదేవి పేరుతో ఒక గుడి ఉండ‌డం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news