Moviesటీం ఇండియా ఫాస్ట్ బౌల‌ర్ బూమ్రా భార్య ఎవ‌రో తెలుసా… హీరోయిన్ల‌కు...

టీం ఇండియా ఫాస్ట్ బౌల‌ర్ బూమ్రా భార్య ఎవ‌రో తెలుసా… హీరోయిన్ల‌కు మించిన అందం..!

భారత క్రికెట్ జట్టు ఫేస్ బౌలర్ బూమ్రా బౌలింగ్‌కు వస్తున్నాడంటే ప్రపంచంలో టాప్ బ్యాట‌ర్లు సైతం టెన్షన్ టెన్షన్తో ఉంటారు. బూమ్రా వేసే యార్కర్లు ఎవరికి అర్థం కావు.. బంతిని ఎప్పుడు ? ఎలా స్వింగ్ చేస్తాడో తెలియక గొప్ప గొప్ప బ్యాటర్లు సైతం టెన్షన్ టెన్షన్ తోనే బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. ఇక బూమ్రా గాయం కారణంగా గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ లో కూడా ఆడటం లేదు.

ఏడాది భారత్లో జరిగే వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ కూడా బూమ్రాకు ఎక్కువగా విశ్రాంతి ఇస్తోంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బూమ్రా తన భార్య సంజన గణేషన్‌తో కలిసి ఒక వేడుకకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా సంజన గణేశ‌న్‌ లుక్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం బూమ్రా తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో సంజన పసుపు రంగు చీరలో హీరోయిన్లను మించిన అందంతో కనిపిస్తున్నారు.

బూమ్రా, తన భార్య సంజన ఇద్దరు ఒకరికొకరు హీరో, హీరోయిన్లలా పక్కపక్కనే ఉన్నారు. వీరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఇస్తున్న స్టైల్ అయితే అదిరిపోయింది అని చెప్పాలి. ఇక సంజన మోడలింగ్ తో తన కెరీర్ ప్రారంభించింది. 2014లో ఆమె మిస్ ఇండియా పోటీలలో ఫైనల్స్ వరకు వెళ్ళింది. అలాగే ఐసీసీ ప్రపంచ కప్ నుంచి మొదలుకొని ఐపీఎల్ వరకు చాలా సీరిస్‌ల‌ను హోస్ట్ చేసింది.

మహారాష్ట్రలోని పూణేకు చెందిన సంజనా గణేశన్ బెస్ట్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా ప్ర‌శంస‌లు అందుకున్నారు. వీరిద్ద‌రి తొలి క‌ల‌యిక 2019లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా జరిగింది. జస్‌ప్రీత్ బూమ్రా సంజనా గణేశన్‌ను 2021లో పెళ్లి చేసుకున్నాడు. సంజనా గణేశన్ క్రికెట్ ప్రేమికుల్లో చాలా ఫ్యామస్. ఇన్‌స్టాగ్రామ్‌లో గణేశన్ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 9 లక్షలుగా ఉందంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news