Moviesపొట్టి నిక్కర్ లో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ అందాలు.. నైట్...

పొట్టి నిక్కర్ లో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ అందాలు.. నైట్ డ్రెస్సుల్లో నిద్ర పట్టనీకుండా చేస్తున్న అరియానా..!

బిగ్‌బాస్ షోతో పిచ్చ‌పిచ్చ‌గా పాపుల‌ర్ అయిన అరియనా గ్లోరీకి బోల్డ్ ఇమేజ్ ఉంది. బిగ్‌బాస్ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక అరియానా ఫొటో షూట్లు, వ‌ర్మ ఆమెతో చేసిన ఇంట‌ర్వ్యూలు ఇవ‌న్నీ ఆమెకు పిచ్చ‌పిచ్చ‌గా బోల్డ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పుడు అరియానా బోల్డ్ అంటే ఏమిటీ? అని నెటిజెన్స్ ని అడిగి అంద‌రికి షాక్ ఇచ్చారు. నైట్ వెర్లో ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అరియనా
క్రేజీ కామెంట్స్‌తో అంద‌రికి ట్విస్ట్ ఇచ్చింది. నాకు ఓ సందేహం… నేను బోల్దా ? అసలు బోల్డ్ అంటే అర్థం ఏంటీ ? అని కామెంట్ పెట్టారు.

ఆమె ప్ర‌శ్న‌కు కొంద‌రు దిమ్మ‌తిరిగే రిప్లే ఇచ్చారు. నైట్ వేర్లో ఫోటో షూట్ చేయడమే బోల్డ్ అన్నారు. మ‌రి కొంద‌రు బనియన్లు, డ్రాయర్స్ వ్యాపారం చేస్తున్నావా ? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక గ‌త కొంత కాలంగా అరియనా ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆమె సోష‌ల్ మీడియాలో ప్రేమ గురించి చేసిన కామెంట్ల‌తో ఈ డౌట్లు చాలా మందికి పుట్టుకు వ‌చ్చాయి.

ఒకరిని ప్రేమించాలనే భావన లేకుండా ప్రేమలో పడిపోతాం.. అదే నిజమైన ప్రేమ. ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంద‌ని కామెంట్ పెట్టింది. అరియానా చాలా కొత్త‌గా, థ్రిల్లింగ్‌గా ప్రేమ‌క‌థ‌లు వ‌ల్లించ‌డంతో ఆమె రిలేష‌న్‌లో ఉంద‌ని చాలా మంది డౌట్లు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో అరియానా పెళ్లి గురించి మాట్లాడుతూ వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని సెటిలైపోతాను… భార్యగా మారి పిల్లల్ని కని… భర్తకు సేవలు చేస్తాన‌ని చెప్పింది.

అయితే ఆ గ్లామ‌ర్ ప్ర‌పంచం ఆమెను ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోనిచ్చేలా లేదు. ఇక బీబీ జోడీలో అరియానా, అవినాష్‌తో క‌లిసి అద‌ర‌గొట్టేసింది. ఏదేమైనా అరియానా ఎలాంటి హాట్ డ్రెస్సులు వేసుకున్నా.. ఆమె అందాల‌కు ఫిదా అయ్యే జ‌నాలు ఎంతోమంది ఉన్నారు. ఆమె ఔన‌న్నా.. కాద‌న్నా ఆమెకు బోల్డ్ ఇమేజ్ అయితే ఫుల్లుగా వ‌చ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news