Moviesవావ్: తారక్ ని జాన్వీ ఏమని పిలుస్తుందో తెలుసా..? నందమూరి ఫ్యాన్స్...

వావ్: తారక్ ని జాన్వీ ఏమని పిలుస్తుందో తెలుసా..? నందమూరి ఫ్యాన్స్ కి పిచ్చి పిచ్చి గా పిచ్చెక్కించేస్తుందిగా..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఈగరుగా వెయిట్ చేస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే పూర్తయ్యాయి . ఈ సినిమా ద్వారా మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ . ఈ సినిమాలో ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్ట బోతుంది జాన్వి కపూర్.

ఇన్ఫాక్ట్ ఆమె ఈ సినిమా ద్వారానే తెలుగులో డేబ్యూ ఇవ్వబోతుంది. ఈ క్రమంలోనే శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా ఇన్నాళ్లు చిట్టిపొట్టి బట్టలతో అలరించిన జాన్వికపూర్ .. ఎన్టీఆర్ 30 సినిమాలో మాత్రం క్లీన్ అండ్ క్లాసిక్ ట్రెడిషనల్ బ్యూటీ గా కనిపించబోతుంది . దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ లుక్స్ లో జాన్వి చాలా క్యూట్ గా ఉంది అంటూ కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి . కాగా ఈ క్రమంలోనే ఫస్ట్ టైం ఈ సినిమా పూజా కార్యక్రమంలో తారక్ ను కలిసిన జాన్వి .. ఆనందం పట్టలేక తారక్ ని ఏమని పిలవాలో తెలియక తన ఫ్యామిలీ పట్ల ఆయన పట్ల ఉన్న గౌరవం కారణంగా సార్ అంటూ పిలిచిందట . ఇదే క్రమంలో తారక్ ఎన్నిసార్లు వద్దు తారక్ అని పిలువు అని చెప్పినా కానీ జాన్వి అలా పిలవలేక పోయిందట . “నందమూరి ఫ్యామిలీ అంటే ఎంత గొప్పదో ..మా మమ్మీ చాలా సార్లు మాకు చెప్పింది.. వివరించింది ..మీ పక్కనే నటించడమే నా అదృష్టంగా భావిస్తున్నాను ..మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం నో వే” అంటూ సరదాగా తారక్ తో మాట్లాడింది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు తారక్ ని ఈ ఈవెంట్ జరుగుతున్నంత సేపు గౌరవంగా సార్ అంటూ పిలిచిందే .. కానీ ఎక్కడ తారక్ తో హద్దులు మీరలేదని అక్కడున్న మేకర్స్ చెప్పుకు వస్తున్నారు . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది జాన్వి . తారక్ కు అంత రెస్పెక్ట్ ఇస్తూ అంత గౌరవంగా చూసుకుంటున్న జాన్వి.. మరో సినిమాలో తారక్ తో కలిసి నటిస్తే కూడా బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే నందమూరి హీరో అంటే ఆ మాత్రం ఉండాలి కదా అంటూ మరికొందరు కామెంట్స్ చూస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news