MoviesRam Charan బిగ్ బ్రేకింగ్: ఇక సినిమాలకు బ్రేక్.. రామ్ చరణ్...

Ram Charan బిగ్ బ్రేకింగ్: ఇక సినిమాలకు బ్రేక్.. రామ్ చరణ్ సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ మెగా వారసుడు మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ రాంచరణ్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిరుత సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ.. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తే దూసుకుపోతున్నాడు . ఆయన రీసెంట్ గా నటించిన సినిమా హాలీవుడ్ ను ఓ రేంజ్ లో కుదిపేస్తుంది .

రీసెంట్ గా హాలీవుడ్ క్రిటిక్స్ విభాగంలో ఏకంగా నాలుగో అవార్డులను సొంతం చేసుకుని సంచలనానికి తెరలేపింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ క్రమంలోనే ఆస్కార్ కి నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రమోట్ చేయడానికి ఆర్ ఆర్ ఆర్ టీం అమెరికాలో సందడి చేస్తుంది . ఈ క్రమంలోని రీసెంట్గా హాలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు . “నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమా కథ వినక ముందు సినిమాలకు బ్రేక్ ఇద్దామనుకున్నానని.. ఏవైనా కొత్త ఎలిమెంట్స్ నేర్చుకుని.. ఆ తర్వాత సరికొత్త ఫ్రెష్ లుక్ తో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇద్దామనుకున్నానని.. కానీ ఎప్పుడైతే రాజమౌళి ఆర్ఆర్ఆర్ కథ చెప్పాడో.. ఆ నిమిషం అన్ని మరిచిపోయి సినిమాని చేయాలి అని స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యానని.. దానికి తగ్గ ఫలితం ఈరోజు దక్కింది “అంటూ ఎమోషనల్ అయ్యారు.

ఈ క్రమంలోనే చరణ్ సినిమాలకు బ్రేక్ చెప్పాలనుకున్నాడా..? అంటూ మెగా హీరో ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ ఆఫర్ రావడం చరణ్ కు మంచి కిక్ ఇచ్చింది అంటున్నారు . అంతేకాదు రాంచరణ్ మాట్లాడుతూ..” రాజమౌళి కాలేజీలో నేను ఒక స్టూడెంట్ అయినందుకు ఎంతో ఆనందిస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి . దీంతో మెగా ఫ్యాన్స్ చరణ్ మాటలకు పొంగిపోతున్నారు . చూడాలి మరి మార్చి 12న అనౌన్స్ చేసే ఆస్కార్ విన్నింగ్ లిస్టులో ఆర్ఆర్ఆర్ ఉంటుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news