Moviesబాప్ రే: మహేశ్ నటించిన ఆ సినిమా చూస్తే నమ్రతకి మండిపోతుందా..?...

బాప్ రే: మహేశ్ నటించిన ఆ సినిమా చూస్తే నమ్రతకి మండిపోతుందా..? టీవిలో వస్తే రిమోర్ట్ పగలకొడుతుందా..?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది క్యూట్ కపుల్స్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రతల జంట అంటే అందరికీ ఎంతో ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా నమ్రతన్ని ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసినా సరే … పెళ్లి తర్వాత భర్త , పిల్లలు ప్రపంచం అంటూ తన కెరీయర్ని వదిలేసుకున్న నమ్రత ఇటీవల ఓ సమావేశంలో పాల్గొని తనదైన స్టైల్ లో ప్రసంగించారు .

కాగా ఈ సమావేశంలో పాల్గొన్న నమ్రతకు మళ్ళీ సినిమాల్లో నటిస్తారా..? అన్న ప్రశ్న ఎదురవగా.. నో అంటూ ఓపెన్ గానే చెప్పింది. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో నమ్రత ఇకపై సినిమాలో నటించను అంటూ ఓపెన్ గానే చెప్పేసింది. అంతే కాదు మహేష్ సినిమాలో నటించమని అడిగిన నటించరా ..? అంటే.. మహేష్ నన్ను అడగడు నేను నటించను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది .

అంతే కాదు మహేష్ సినిమాలో మీకు నచ్చని మూవీ ఏది అంటే సెకండ్ కూడా ఆలోచించకుండా సైనికుడు అని చెప్పేసింది. స్టూడెంట్స్ రాజకీయాలకు రావాలన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ గా మారింది. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది . కేవలం నమ్రతకే కాదు మహేష్ బాబు కూడా ఈ సినిమా అంటే ఇష్టం లేదు అంటూ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .

అంతేకాదు అప్పట్లో టీవీలో ఈ సినిమా వస్తే రిమోట్ పగలకొట్టేసింది అన్న రూమర్లు కూడా వైరల్ అయ్యాయి . అంతేకాదు దీనిపై మళ్లీ నమ్రతనే స్పందిస్తూ..” ఎందుకో నాకు ఇప్పటికీ ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు “అంటూఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే నమ్రత చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news