MoviesRashmika ఛీ ఛీ రష్మిక డబులిచ్చి అలా చేయించుకుంటుందా..? ఇదేం కర్మ...

Rashmika ఛీ ఛీ రష్మిక డబులిచ్చి అలా చేయించుకుంటుందా..? ఇదేం కర్మ రా సామీ..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా రష్మిక మందన ఎప్పుడైతే కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో వివాదానికి దిగిందో అప్పటినుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది. రష్మిక మందన ఊ అన్న తిట్లే..ఊ ఊ అన్న తిట్లే.. ఇలా ఏమి చేసినా సరే టార్గెట్ చేసి ట్రోల్ చేయడం పరిపాటిగా మారిపోయింది . రీసెంట్ గా రష్మిక మందన సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని పంపిన ఫ్లవర్ బొకేను షేర్ చేసింది.

నిజానికి అది ఫ్లవర్ బొకేనే అయినా.. అది మొత్తం సీతాకోకచిలుకల డిజైన్ లో చాలా స్పెషల్ గా ఉంది . చూడగానే అద్యంతం ఆకట్టుకునేలా ఉంది . ఈ క్రమంలోని అది పంపించిన రష్మిక మందన ఫ్యాన్ ఓ స్పెషల్ నోట్ కూడా రాసి పంపించాడు . అందులో రష్మిక మందన అని ఇంగ్లీషులో.. హిందీలో రాసి.. మిమ్మల్ని ఎక్కువగా అభిమానించే అభిమానుల్లో నేను ఒకడిని అంటూ నోట్ చేశాడు. ఈ క్రమంలోనే రష్మిక మందన.. ఆ యూకే కి చెందిన ఫ్యాన్ ని స్పెషల్ గా మెన్షన్ చేస్తూ ఓ రేంజ్ లో పొగిడేసింది.

అయితే ఇదంతా చూసిన కొందరు ఆకతాయిలు రష్మిక ని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. ” నీ ఫేస్ కి అంత సీన్ ఉందా..? నువ్వే కావాలని డబ్బులు ఇచ్చి ఎవరో దగ్గర ఇలా బొకే పంపించి ..అది మళ్ళీ నువ్వే ప్రమోట్ చేసుకుంటున్నట్లు ఉంది తప్పిస్తే.. ఇక్కడ ఎక్కడ అభిమానం కనిపించట్లేదు” అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఈ మధ్యకాలంలో ఫ్లాప్స్ పడిన నీకు ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడి నుంచి వస్తుంది.. సోషల్ మీడియాలో కూడా నువ్వు డబ్బులు ఇచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్ రప్పించుకుంటున్నావు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news