Moviesజయసుధ- కైకాల సత్యనారాయణ ప్రేమ ఇలా ఫెయిల్ అయిందా..!

జయసుధ- కైకాల సత్యనారాయణ ప్రేమ ఇలా ఫెయిల్ అయిందా..!

సీనియర్ నటుడు దివంగత కైకాల సత్యనారాయణ, సహజనటి జయసుధ ప్రేమలో పడ్డారా ? వీరిద్దరి మధ్య ప్రేమ ఏంటి ? వీరిద్దరి ప్రేమ ఎలా ? ఫెయిల్ అయింది అన్నది టైటిల్ చూస్తేనే ఆసక్తిగా అనిపిస్తుంది. దీని వెనకాల ఒక ఆసక్తికరమైన కథ ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో డి రామానాయుడు సెక్రటరీ సినిమా నిర్మించారు. ఈ సినిమా శత దినోత్సవ ఫంక్షన్ మద్రాసులోని వుడ్ ల్యాండ్ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ముందుగా ఏఎన్నార్ సినిమా హిట్ అవ్వ‌డం గురించి మాట్లాడారు

ఆ తర్వాత కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ సురేష్ ప్రొడక్షన్స్ లో ఏఎన్ఆర్ ఏమిటి ? నేను హీరోగా చేసినా సినిమా హిట్ అవుతుందని అన్నారట. వెంటనే నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ సత్యనారాయణను ఉద్దేశించి హీరోగా చేయాలన్న నీ కోరిక నేను తీరుస్తాను.. అని అందరి ముందు మాట ఇచ్చారట. ఆ తర్వాత రామానాయుడు తన బ్యానర్లో బోయిన‌ సుబ్బారావు దర్శకత్వంలో సావాసగాళ్లు సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నగేష్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.

అయితే ప్రతి సీన్లోను నగేష్ ఎంటర్ అయ్యి దర్శకుడికి ఇబ్బంది కలిగిస్తున్నారట. వెంటనే రామానాయుడు సీరియస్ అయి.. నగేష్ నేను నిర్మాతను, ఆయన దర్శకుడు, దర్శకుడు విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు… నీకు డైరెక్షన్ చేయాలన్న ముచ్చట ఉంటే నేను తీరుస్తాను అని సరదాగా అన్నారట. వెంటనే నగేష్ మరుసటి రోజు ఒక రచయితను తీసుకొని ఒక కథ పట్టుకుని రామానాయుడు దగ్గరకు వెళ్లిపోయారట. నగేష్ ఆ కథను అటు ఇటు చెక్కి ఒక రొమాంటిక్ స్టోరీగా మార్చారట

రామానాయుడు వెంటనే ఈ సినిమాలో హీరోగా సత్యనారాయణ పెట్టాలని ఫిక్స్ అయిపోయారట. అయితే ఇండస్ట్రీకి చెందిన చాలామంది పెద్దలు సత్యనారాయణ హీరోగా సెట్ కారని.. ఈ కథకు కృష్ణ‌ లేదా కృష్ణంరాజు బాగా సూట్ అవుతారని చెప్పారట. అయితే రామానాయుడు తను అప్పటికే సత్యనారాయణకు మాట ఇచ్చి ఉండడంతో ఆయనతోనే సినిమా చేస్తానని పట్టుబట్టారట. చివరికి నవయుగ డిస్ట్రిబ్యూటర్లు కూడా సత్యనారాయణ హీరోగా చేస్తే సినిమా ఎవరు ? చూస్తారని రామానాయుడు వద్ద గగ్గోలు పెట్టారట. ఆయన రామానాయుడు మాత్రం తను ఇచ్చిన మాట కోసం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

ఈ సినిమాలో సహజనటి జయసుధను హీరోయిన్‌గా తీసుకున్నారు. సత్యనారాయణ పక్కన జయసుధ హీరోయిన్ ఏంటని చాలామంది సన్నాయి నొక్కులు నొక్కారట. అయితే రామానాయుడు అడగడంతో జయసుధ కాదనలేదు. సత్యనారాయణ పక్కన హీరోయిన్‌గా చేసేందుకు ఒప్పుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గోదావరి ఒడ్డున షూటింగ్ జరుగుతుండగా.. జయసుధ స్నానం చేసి సత్యనారాయణకు ముద్దు పెట్టే సీన్ షూట్ చేస్తున్నారట. అప్పుడు సత్యనారాయణ పరిగెత్తుకుని జయసుధ వద్దకు వెళ్లే సీన్ షూటింగ్ జరుగుతుందట.

అయితే కింద నుంచి ఆ షూటింగ్ చూస్తున్న చాలామంది ఆంబోతు పరిగెత్తుకు వస్తుంది అని హేళన చేశారట. అప్పుడే రామానాయుడుకి ఈ సినిమా ప్లాప్ అవుతుందని అర్థమయిపోయిందట. చివరకు అనుకున్నట్టుగానే మొరటోడు సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అలా జయసుధ – సత్యనారాయణ ప్రేమ కథ ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది. ఆ రోజుల్లోనే ఆ సినిమా చేసి ఐదు లక్షలు పోగొట్టుకున్నానని రామానాయుడు ఓ సందర్భంలో చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news