MoviesMega Heroes మెగా అనే ట్యాగ్ ముందు లేకపోతే..ఈ హీరోలు దానికి...

Mega Heroes మెగా అనే ట్యాగ్ ముందు లేకపోతే..ఈ హీరోలు దానికి కూడా పనికి రారా..!?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కామన్ గా వినిపించే పదం మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో సగానికి సగం మందికి పైగా హీరోలు.. మెగా ఫ్యామిలీ నుంచి రావడంతో నే ఈ తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. మిగతా ఫ్యామిలీ నుండి కూడా ఇండస్ట్రీలో వారసత్వం పేరుతో హీరోలను దింపారు. అయితే మెగా ఫ్యామిలీ దింపిన అంత మంది హీరో లను ఏ ఫ్యామిలీ లో రాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఎప్పుడు మెగా ఫ్యామిలీ హీరోస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటారు . కాగా మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఆయన భిక్షతో ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన చాలామంది మెగా హీరోలు ప్లాప్ అయ్యారు.

మరి ముఖ్యంగా సక్సెస్ అయ్యింది ఇద్దరో ముగ్గురో అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ సొంత హీరోలను టార్గెట్ చేసి ట్రొల్ చేస్తున్నారు . మెగా ట్యాగ్ వేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ మిగతా హీరోలతో కంపేర్ చేస్తే బెటర్ అనే చెప్పాలి. కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోని సుప్రీం హీరోగా చేసి ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు.

అయితే అల్లు శిరీష్ ను మాత్రం మెగా ఫాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు . ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లేవని..అసలు హీరోగా నువ్వు వేస్ట్ అంటూ సొంత ఫ్యాన్స్ నే ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఈ మధ్యనే ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా అంతే . ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు కాదు కదా కనీసం డైలాగ్స్ చెప్పడం కూడా రాదు అంటూ ఆయన పరువు తీసేస్తున్నాడు . ఇక కళ్యాణ్ దేవ్ గురించి అయితే చెప్పనవసరంలేదు.. ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చాడో ..ఎప్పుడు కనుమరుగయ్యాడో ఎవరికీ తెలియదు.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా మెగాట్యాగ్ఉ పయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాడే. అయినా ఆయన పర్లేదు అనిపించాడు. కానీ ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ కూడా డల్ అయ్యాడు. రీసెంట్ కాలంలో ఆయన నటించిన సినిమా రిలీజ్ అయింది లేదు . కానీ రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి మార్కులు వేయించుకుంటారు. అయితే మెగా ఇండస్ట్రీలో మొత్తంగా మెగా ట్యాగ్ ఉపయోగించుకుని వచ్చిన హీరోలల్లో సక్సెస్ అయిన వారు రామ్ చరణ్ -అల్లు అర్జున్ -పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పాలి .ఈ క్రమంలోనే ఒకవేళ వీళ్ళు మెగాట్యాగ్ ఉపయోగించుకోకపోయి ఉంటే కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు కూడా పనికిరారు అంటూ యాంటీ మెగా ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news