MoviesNagarjuna నాగార్జున ఆ విషయంలో ఎక్కువుగా ఆలోచిస్తున్నాడా..? ముసలోడికి అంత సీన్...

Nagarjuna నాగార్జున ఆ విషయంలో ఎక్కువుగా ఆలోచిస్తున్నాడా..? ముసలోడికి అంత సీన్ ఉందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి పేరు పరువు – ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాడు అక్కినేని నాగార్జున . కాగా సిక్స్టీ ప్లస్ లోను తనకంటూ ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగార్జున.. చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా స్టైలిష్ లుక్స్ లో అదరగొడుతూ ఉంటాడు . మరి ముఖ్యంగా కొడుకులకి మించిపోయిన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఎక్కడికెళ్ళిన నాగార్జున టాప్ ప్లేస్ లోనే ఉంటాడు .

కాగా నాగార్జున ప్రెసెంట్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు . తన ఏజ్ కు తగ్గ పనులు చేయాలని డిసైడ్ అయ్యాడు . ఈ క్రమంలోని ఇన్నాళ్లు చేసిన బిగ్ బాస్ కి హోస్టుగా కూడా తప్పుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అయితే బిగ్ బాస్ మెనేజ్ మెంట్ మాత్రం నాగ్ కావాలి అంటూ పట్టు బట్టి మరి ఆయనే హోస్ట్ గా చేయాలని ట్రై చేస్తున్నారట . అయితే నాగార్జున ఈ విషయంలో కూసింత ఎక్కువగానే ఆలోచిస్తున్నాడు అంటూ అక్కినేని కాంపౌండ్ నుంచి టాక్ వినిపిస్తుంది.

గతంలో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్స్ ఎలాంటి ట్రోలింగ్కి గురైందో అందరికి తెలిసిందే . పరమ చెత్త టిఆర్పి రేటింగ్స్ తో నాగార్జునను ఏకీపారేశారు జనాలు. ఈ క్రమంలోని నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి..ఆ ప్లేస్ లో రానా దగ్గుబాటి సెలెక్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే నాగార్జునకున్న బ్యాగ్రౌండ్ సర్కిల్స్ కారణంగా నాగార్జుననే ఈ షో హోస్ట్ చేయాలి అంటూ పలువురు ఆయనను సంప్రదిస్తున్నారట.

అయితే ఇదే విషయం తెలుసుకున్న రానా దగ్గుబాటి ఫాన్స్ నాగార్జునను ఏకిపారేస్తున్నారు . ముసలోడికి అంత సీన్ లేదు..ఆయన సినీ చాప్టర్ క్లోజ్ ..రానా దగ్గుబాటి లాంటి యంగ్ స్టర్ బిగ్ బాస్ కి కావాలి.. యంగ్ బ్లడ్ కావాలి అంటూ ఓ రేంజ్ లో నాగార్జున డౌన్ చేస్తున్నారు . కేవలం బిగ్ బాస్ నే కాదు ..ఈ మధ్యకాలంలో నాగార్జునను ప్రతి విషయంలో టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . ఆయన మాట్లాడిన మాట్లాడకపోయినా ప్రతి విషయంలో నాగార్జున ఇన్వాల్వ్ చేస్తూ అక్కినేని ఇంటి పరువును రోడ్డు మీదకు తీసుకొస్తున్నారు. దీంతో అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news