MoviesNagarjuna ఇల్లాలు అమ‌ల‌.. ప్రియురాలు ట‌బు మ‌ధ్య‌లో నాగ్‌… ఈ ఫొటోకు...

Nagarjuna ఇల్లాలు అమ‌ల‌.. ప్రియురాలు ట‌బు మ‌ధ్య‌లో నాగ్‌… ఈ ఫొటోకు ఇంత చ‌రిత్ర ఉందా…!

గ్రీకువీరుడు.. నా రాకుమారుడు క‌ళ్ల‌ల్లోనే ఇంకా ఉన్నాడు ఈ పాట 25 ఏళ్ల క్రితం ఎంత సెన్షేష‌న‌ల్ అయ్యిందో తెలుగునాట ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేరు. నాగార్జున త‌న అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సొంతంగా నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ‌వంశీ ద‌ర్శ‌కుడు. అప్ప‌టికే బాలీవుడ్‌ను త‌న అంద‌చందాల‌తో ఏలేస్తోన్న ట‌బు నాగ్‌కు జోడీగా న‌టించింది. ఆమె తెలుగులోనూ కూలీ నెంబ‌ర్ 1 లాంటి కొన్ని సినిమాలు చేసినా నాగ్‌కు జోడీగా అదే ఫ‌స్ట్ సినిమా.

ఆ సినిమాలో నాగ్ మ‌ర‌ద‌లిగా ఇద్ద‌రి మ‌ధ్య అదిరిపోయే రొమాంటిక్ సీన్లు ఉండ‌డం.. ఆ సీన్ల‌లో నాగ్‌, ట‌బు న‌టించారు అన‌డం కంటే జీవించడం హైలెట్‌. పండు పండు అంటూ నాగ్‌.. ట‌బును ఆట‌ప‌ట్టించ‌డం అప్ప‌ట్లో యూత్‌ను బాగా గిలిగింత‌లు పెట్టేసింది. నాగ్ అందానికి, యాట్యిట్యూడ్‌కు అప్ప‌ట్లో ఫిదా కానీ హీరోయిన్ ఎవ‌రు మాత్రం ఉంటారు.

అలా ఫిదా అయ్యే అమ‌ల నాగ్‌ను కొంగున ముడేసుకుంది. అస‌లు నాగ్‌ది ప్లే బాయ్ రోల్‌. అమ‌ల‌ను కూడా అలాగే చూడాల‌నుకున్నాడ‌ని.. అయితే తెలివిగా అమ‌ల ఫిట్టింగ్ పెట్టేసి నాగ్‌తో త‌న మెడ‌లో మూడు ముళ్లు వేయించేసుకుంద‌ని అంటారు. ఆ త‌ర్వాత ట‌బుపై కూడా నాగ్‌కు మ‌న‌స్సు మ‌ళ్లింద‌ని.. వీరిద్ద‌రి మ‌ధ్య చాలా ప్రేమ వ్య‌వ‌హారం న‌డించ‌ద‌న్న‌ది ఓపెన్ సీక్రెట్‌.

నిన్నే పెళ్లాడ‌తా టైంలో ఏర్ప‌డిన ఈ బంధం కోస‌మే నాగ్ ప‌ట్టుబ‌ట్టి ఆవిడా మాఆవిడే సినిమాలో మ‌రోసారి ట‌బుకే ఛాన్స్ ఇప్పించాడంటారు. అయితే నాగ్ – ట‌బు బంధం కూడా బాగా బ‌ల‌ప‌డింది. అమ‌ల మాత్రం ప‌ట్టిన ప‌ట్టు ప‌ట్ట‌కుండా నాగ్‌ను త‌న కంట్ర‌ల్లోకి తెచ్చుకుంద‌ని కూడా అంటూ ఉంటారు. నాగ్ కూడా ట‌బు అంటే ఎంత ఇష్టం ఉన్నా ఆమె త‌న బెస్ట్ ఫ్రెండ్ అని గ‌తంలో ఎన్నో సార్లు చెప్పాడు.

ట‌బు కూడా ఇప్ప‌ట‌కీ ఎక్కువుగా హైద‌రాబాద్‌లోనే ఉంటోంది. ఆమె ఇక్క‌డ ఉన్న‌ప్పుడ‌ల్లా నాగార్జున‌కు చెందిన గెస్ట్‌హౌస్‌లోనే ఉంటుంది. ఇక నాగ్ భార్య అమ‌ల‌, ఇటు ఒక‌ప్ప‌టి ప్రియురాలో స్నేహితురాలో కాని ట‌బు మ‌ధ్య‌లో న‌లుగుతోన్న రేర్ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోలో నాగ్ ఇద్ద‌రి మ‌ధ్య‌లో న‌వ్వులు చిందిస్తున్నాడు. అమ‌ల నాగ్ ముందు న‌వ్వులు చిందిస్తుంటే.. ట‌బు నాగ్‌ను వెన‌క‌వైపు నుంచి వాటేసుకుని న‌వ్వులు చిందిస్తోంది. ఈ ఫొటో నిన్నే పెళ్లాడుతా షూటింగ్ టైంలో తీసింద‌ట‌. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news