Moviesవీరసింహా రెడ్డి డైరెక్టర్ అన్న ఆ మాట.. ఇప్పుడు వైరల్ అవుతుందే..ఏంటబ్బా..?

వీరసింహా రెడ్డి డైరెక్టర్ అన్న ఆ మాట.. ఇప్పుడు వైరల్ అవుతుందే..ఏంటబ్బా..?

ఎస్ ప్రజెంట్ వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్న మాటలు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని అంతకుముందు క్రాక్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అదిరిపోయే హిట్ ని అందించాడు . కాగా వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ మలినేని స్టేజ్ పై మాట్లాడుతూ ..”తాను బాలయ్యకు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బిగ్ ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చాడు.

బాలయ్య తో సినిమా తీసి తన కోరికలు నెరవేర్చుకున్నానని .. త్వరలోనే పవన్ కళ్యాణ్ అవకాశమిస్తే .. పవర్ ఫుల్ పర్ఫామెన్స్ తో జనాల ముందుకు వస్తానంటూ ఆయన డేట్స్ కోసం ఓపెన్గా అడిగారు. రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ ..ప్రభాస్ కోసం ఒక కథ సిద్ధం చేసుకుంటున్నాను అని ..ప్రభాస్ కనుక ఓకే చెప్తే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తోనే ఉంటుంది అంటూ ఎంత మాట ఇచ్చాడు. అయితే ప్రభాస్ కాల్ షీట్స్ చూస్తే దాదాపు నాలుగేళ్ల వరకు ఒక్క కాల్ షీట్ ఇచ్చే పొజిషన్లో కూడా లేదు.

ప్రజెంట్ సల్లార్ , ప్రాజెక్టు కే, రాజా డీలక్స్ ..సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత సెన్సేషనల్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా తో మరో సినిమాకి కనెక్ట్ అయి ఉన్నాడు . ఆ తర్వాత బాహుబలి 3 అంటూ రాజమౌళి కూడా రెడీగా ఉన్నాడు. ఇవన్నీ క్లియర్ చేసుకొని ప్రభాస్ తో సినిమా అంటే దాదాపు ఆరేళ్ళు పడుతుంది.దీని కోసం గోపీచంద్ మలినేని నాలుగైదు సినిమాలు తీసేయొచ్చు అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో అన్ని తెలిసి గోపీచంద్ మలినేని ప్రభాస్ తో సినిమాకు ఎలా కమిట్ అవుతాడు.. ఆయన కోసం స్క్రిప్ట్ ఎలా రెడీ చేస్తాడు అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news