Moviesఆ టాలీవుడ్ టాప్ ప్రొడ్యుస‌ర్ భార్య సంక్రాంతికి ఫుల్లుగా జూదంలో మునిగిపోయిందా..!

ఆ టాలీవుడ్ టాప్ ప్రొడ్యుస‌ర్ భార్య సంక్రాంతికి ఫుల్లుగా జూదంలో మునిగిపోయిందా..!

సంక్రాంతి వ‌చ్చిందంటే చాలు చాలా మంది టాలీవుడ్ జ‌నాలు గోదావ‌రి జిల్లాల‌కు వెల్లిపోతారు. అక్క‌డ మూడు రోజుల పాటు మ‌కాం వేసి సంక్రాంతి పందాల‌ను, ఇత‌ర జూదాల‌ను బాగా ఎంజాయ్ చేసి వ‌స్తూ ఉంటారు. ఆ మాట‌కు వ‌స్తే కేవ‌లం తెలుగు సినిమా జ‌నాలే కాదు… తెలంగాణ‌కు చెందిన పారిశ్రామిక‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు సైతం ఆంధ్రాకు వెళ్లి మూడు రోజుల సంక్రాంతి ఎంజాయ్ చేసి రావ‌డం మామూలు విష‌య‌మే.

అయితే ఈ సారి సంక్రాంతి పందాల‌కు ఓ అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఓ స్టార్ ప్రొడ్యుస‌ర్ భార్య కూడా ఆంధ్రాకు వెళ్లి మూడు రోజుల పాటు సంక్రాంతి పందాల‌ను బాగా ఎంజాయ్ చేసిన‌ట్టు తెలిసింది. కోడి పందాల్లో ఆమె ల‌క్ష‌లు ల‌క్ష‌లు బెట్టింగ్ క‌ట్టి మ‌రీ త‌న స‌ర‌దా తీర్చుకుంద‌ట‌. మామూలుగా టాలీవుడ్ నిర్మాత‌ల భార్య‌లు క‌లిసి క‌ట్టుగా ఏ దుబాయ్‌కో వెళ్లి స‌ర‌దాగా ఎంజాయ్ చేసి రావ‌డం.. విదేశాల‌కు వెళ్లి షాపింగ్‌లు చేసి వ‌స్తూ ఉంటారు.

అయితే ఈ సారి స‌ద‌రు నిర్మాత భార్య మాత్రం కోడిపందాలు ఆడాల‌ని త‌న భ‌ర్త‌కు చెప్పి ల‌క్ష‌లు ప‌ట్టుకెళ్లి మ‌రీ జూదం ఎంజాయ్ చేసింద‌ట‌. ఆ నిర్మాత బ‌డా నిర్మాత‌. చేతిలో చాలా సినిమాలు.. ఇటు డిస్ట్రిబ్యూష‌న్లో ఫుల్ బిజీ.. అస్స‌లు ఖాళీనే ఉండ‌దు. అయితే ఆ నిర్మాత భార్య‌కు ఆంధ్రాలో వ్యాపారాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు స్నేహితురాళ్ల‌ను వెంటేసుకుని వెళ్లి ఈ సారి కోడి పందాల‌ను బాగా ఎంజాయ్ చేసి.. ల‌క్ష‌లాది రూపాయ‌ల పందాలు కాసిన‌ట్టు తెలిసింది.

నిర్మాత‌ల భార్య‌ల్లో చాలా మంది స్నేహితులుగా ఉంటారు. వారంతా ఏ బెంగ‌ళూరుకో లేదా దుబాయ్ లేదా మ‌రో చోట‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే అందుకు భిన్నంగా స‌ద‌రు నిర్మాత భార్య ఈ సారి కోడిపందాల‌ను చూసేందుకు.. ఎంజాయ్ చేసేందుకు ఆంధ్రా వెళ్ల‌డ‌మే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news