Moviesతెలుగు కుర్రాడి కోసం అలాంటి పని చేస్తున్న దీపికా.. ఇప్పటి వరకు...

తెలుగు కుర్రాడి కోసం అలాంటి పని చేస్తున్న దీపికా.. ఇప్పటి వరకు ఏ హీరో కి దక్కని అరుదైన ఛాన్స్..!?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న దీపిక పదుకునే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ చెరగని ముద్రను వేయించుకొని కొనసాగుతున్న దీపికా పదుకునే..నేడు తన 37 వ పుట్టినరోజును జరుపుకుంటుంది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఆమె ఫాన్స్ దీపిక పదుకొనే పోస్టర్స్ ను , పేరుని , హాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే తెలుగులో ఫస్ట్ టైం నటిస్తున్న సినిమా ప్రాజెక్టు కె కి సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ర్ ను రిలీజ్ చేశారు చిత్ర మేకర్స్. నాగ్ ఆశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన ప్రాజెక్టుకె లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కాగా రీసెంట్ గా ప్రాజెక్టుకె కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది .

అయితే ఇప్పటివరకు తన సినిమాకు సంబంధించిన ఏ డైలాగ్స్ ని ప్రాక్టీస్ చేయని దీపికా పదుకొనే ..ప్రభాస్తో సీన్ అనేసరికి ఒకటికి మూడు సార్లు ప్రాక్టీస్ చేసి మరి షూటింగ్ లొకేషన్లోకి ఎంటర్ అవుతుందట . ఇప్పటివరకు దీపిక పదుకొనే తాను ఇన్ని సినిమాలో నటించినా ఏ సినిమా కోసం ఇంత రిహార్సిస్ చేయలేదని.. కేవలం ప్రభాస్ తో డైలాగ్ అనేసరికి మాత్రమే ప్రాజెక్టుకే విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందని.. ప్రభాస్ అంతటి గొప్ప నటుడని జనాలు చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే ప్రాజెక్ట్ కే ద్వారా తెలుగులో తన లక్ ని పరీక్షించుకోవడానికి దీపికా పదుకొనే చాలా కష్టపడుతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ప్రాజెక్ట్ కే సినిమా దీపికా పదుకునేకు ఎలాంటి హిట్ అందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news