Moviesటాలీవుడ్‌లో ఫీమేల్ సింగర్ల‌కు ఛాన్సులు ఇవ్వాల‌న్నా క‌మిట్‌మెంట్ ... !!

టాలీవుడ్‌లో ఫీమేల్ సింగర్ల‌కు ఛాన్సులు ఇవ్వాల‌న్నా క‌మిట్‌మెంట్ … !!

సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఎలాంటి వారైనా ఏదో ఒక దశలో ఊహించని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్స్.. ఫీమేల్ ఆర్టిస్టులు..సింగర్స్.. అలాగే మిగతా భాగాలలో చేసే లేడీస్ ఎవరైనా మానసికంగా, ఆర్ధికంగా కంటే కూడా శారీరకంగా కొన్ని తీవ్ర స్థాయిలో భరించాల్సి వస్తుంది. కానీ, ఈ ఒత్తిళ్లు అన్నింటినీ తట్టుకోవాలని నిర్ణయించుకునే వస్తున్నారు చాలామంది.

కనిపించకుండా ఇబ్బందులకి గురి అవుతున్న వారు అన్నీ రంగాలలో ఉన్న మాట వాస్తవం. దీనికి ఎవరైనా ఏకీభవించాల్సిందే. అయితే, గ్లామర్ ప్రపంచంలో కొందరు పాపులారిటీ కోసం తల వంచితే కొందరు తప్పని పరిస్థితుల్లో చేతులేసినా… కాళ్ళు వేసినా కిమ్మనకుండా ఉంటున్నారు. అవకాశాల కోసం బలైపోయి ఏదీ దక్కక బయటకి వచ్చి వాపోతున్న‌వారూ కనిపిస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో సింగర్స్ కూడా పై స్థాయి వారి నుంచి శారీరకంగా హింసించబడుతున్నారనే ఇటీవల కాలంలో మనం చాలా చూశాము. ఒక్క పాట పాడితే వచ్చే పాపులారిటీ ఏపాటిదో అందరికీ తెలిసిందే. కానీ, ఆ ఒక్క పాట పాడే అవకాశం కోసం చిన్నతనం నుంచి చేసిన సాధన కంటే ఓ సంగీత దర్శకుడిని..దర్శక నిర్మాతలను మెప్పించడానికి పడే కష్టాలే ఎక్కువ అని చెప్పుకుంటున్నారు.

a female singer silhouette back lit with microphone.

ఊరికే నీకు ఛాన్స్ ఎందుకివ్వాలి. నాకేంటీ..? అనే ప్రశ్న మొదలై తను మంచి సింగర్ మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పే వరకూ మధ్యలో ఎన్నో ముళ్ళతో పొడిపించుకోవాల్సి వస్తోంది. అన్ని ముళ్ళు గుచ్చినా కానీ, ఆ సింగర్‌ను ప్రపంచానికి పరిచయం చేసి ఉన్నత స్థానాని తీసుకొస్తారా..? అంటే నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. అందుకే బాగా గనక గమనిస్తే చాలా మంది అద్భుతమైన ఫీమేల్ సింగర్స్ కనుమరుగైపోతున్నారు.

మ‌రి కొంద‌రు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో రాజీప‌డుతున్నారు. అప్పుడే వారికి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అస‌లు సింగ‌ర్ చిన్మ‌యి లాంటి వాళ్లు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి చెప్పారు. టాలీవుడ్‌లోనూ ఒక‌రిద్ద‌రు టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు సైతం ఛాన్సుల పేరుతో కొత్త ఫీమేల్ సింగ‌ర్ల‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news