Moviesవీర‌సింహా డే 1 బాక్సాఫీస్ ఉచ‌కోత‌... ఎన్టీఆర్‌, బ‌న్నీ, మ‌హేష్‌నే త‌ల‌ద‌న్నే...

వీర‌సింహా డే 1 బాక్సాఫీస్ ఉచ‌కోత‌… ఎన్టీఆర్‌, బ‌న్నీ, మ‌హేష్‌నే త‌ల‌ద‌న్నే రికార్డ్‌..!

బాల‌య్య వీర‌సింహా ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఊచ‌కోత కోసేశాడు. అస‌లు ఎవ్వ‌రూ కనివినీ ఎరుగ‌ని రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌ట్టాడు. సినిమాకు ముందు నుంచే మంచి హైప్ ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే అన‌కాప‌ల్లి నుంచి హైద‌రాబాద్‌, అమెరికా వ‌ర‌కు ఫ‌స్ట్ డే అన్ని థియేట‌ర్ల‌లో అన్ని షోలు హౌస్‌ఫుల్స్ అయ్యాయి. దీనికి తోడు ఫ‌స్ట్ డే సోలో రిలీజ్ రావ‌డంతో పాటు తెలుగు గ‌డ్డ‌మీద ఉన్న అన్ని థియేట‌ర్ల‌లోనూ వీర‌సింహాయే వేశారు.

ఉద‌యం 4 గంట‌ల నుంచే షోలు ప‌డిపోవ‌డం.. రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కాస్త కోప‌రేట్ చేయ‌డంతో వీర‌సింహాకు ఫ‌స్ట్ డే దుమ్ము రేగిపోయే వ‌సూళ్లు వ‌చ్చాయి. అస‌లు బాల‌య్య బాబు చ‌రిత్ర‌లోనే కనివినీ ఎరుగ‌ని రేంజ్ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఓవ‌ర్సీస్‌లో ఫ‌స్ట్ డే మిలియ‌న్ మార్క్ వ‌సూళ్ల‌కు చేరువైన ఈ సినిమా సీడెడ్‌లోనే ఏకంగా రు. 6 కోట్ల‌కు పైగా షేర్ కొల్ల‌గొట్టింది.

నైజాంలోనూ బాల‌య్య కెరీర్‌లో ఆల్ టైం రికార్డుగా నిలిచింది. బాల‌య్య గ‌త సినిమా అక్కడ ఫ‌స్ట్ డే 3.9 కోట్ల నెట్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితే వీర‌సింహారెడ్డి జీఎస్టీతో క‌లిపి 5.2 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అక్క‌డ ఈ సినిమా 400కు పైగా స్క్రీన్ల‌లో రిలీజ్ అయ్యింది. అస‌లు బాల‌య్య‌కు ఫ‌స్ట్ డే ఈ రేంజ్ షేర్ అంటే అది అరాచ‌క‌మే అని చెప్పాలి.

హైద‌రాబాద్‌లో కేవ‌లం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మాత్ర‌మే రు. 43 ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూల్లు రాబ‌ట్టింది. ఇక ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫ‌స్ట్ డే రు. 54 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. అస‌లు ఈ రేంజ్ వ‌సూళ్లు కుర్ర స్టార్ హీరోలు మ‌హేష్‌, బ‌న్నీ, ఎన్టీఆర్‌కే సోలోగా సాధ్యం కాలేదు. అస‌లు దీనిని బ‌ట్టి బాల‌య్య మానియా తెలుగునాట ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అది కూడా టిక్కెట్ రేట్లు త‌క్కువుగా ఉండి.. సినిమాకు ఓ మోస్త‌రు టాక్ ఉంటేనే ఈ వ‌సూళ్లు వ‌చ్చాయి. అదే టాక్ ఇంకా బెట‌ర్‌గా ఉంటే ఇంకెన్ని రికార్డులు ప‌గిలిపోయేవో ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news