Moviesఎక్స్‌పోజింగ్ విష‌యంలో ఈ 5గురు హీరోయిన్ల స్పెషాలిటీ ఇదే...!

ఎక్స్‌పోజింగ్ విష‌యంలో ఈ 5గురు హీరోయిన్ల స్పెషాలిటీ ఇదే…!

గ్లామర్ అనేది సినిమాల్లో విజయానికి సక్సెస్ ఫార్ములా ఖచ్చితంగా కాదు. ఎందుకంటే గ్లామర్ కన్నా ముఖ్యమైనది ఏది అని ఎవరైనా అడిగినప్పుడు చాలా మంది కథానాయికలు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవచ్చు. గ్లామర్ లేదా పెర్ఫార్మెన్స్ అంటే హీరోయిన్స్ కొందరు మాత్రం నటనకే ఓటు వేస్తారు. మరి గ్లామర్ తో పైకి వచ్చిన నటీమణులు కూడా ఖచ్చితంగా ఉన్నారు. అయితే ఎలాంటి ఎక్సపోసింగ్ లేకుండా పాపులర్ అయినా కొంతమంది ప్రముఖ నటీమణులు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

భూమిక చావ్లా :
భూమికా చావ్లా 20 ఏళ్ళ క్రితం ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత ‘కుషి’లో పవన్ కళ్యాణ్ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇండస్ట్రీలోని పెద్ద స్టార్స్ అందరితో నటించడం వల్ల భూమిక ఎక్కడ కూడా వెనుదిరిగి చూడలేదు. అయితే ఆమె ఎప్పుడూ గ్లామర్‌ పాత్రలు మాత్రం చేయలేదు. 2003లో సల్మాన్ ఖాన్‌తో బాలీవుడ్‌లో తన తొలి సినిమా లో నటించిన రోజు నుండి నేటి వరకు ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదు.

లయ :
లయ తన తొలి చిత్రం స్వయంవరంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఉత్తమ నటిగా 3 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. లయ ఎక్కువగా ట్రెడిషనల్ పాత్రలలో కనిపించింది, హీరోయిన్ గా కెరీర్ ముగిసిన సమయంలో కొన్ని సైడ్ క్యారెక్టర్ పాత్రలను కూడా పోషించింది. “నువ్వు లేక నేను లేను”లో ఆమెను చిన్న పాత్రలో మనం గమనించవచ్చు. కానీ ఆమె ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో మాత్రం నిలబడలేకపోయింది.

సౌందర్య :
సౌందర్య… ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఏదైతే చేయాలనీ కలలు కంటారో అవన్నీ కూడా ఆమె సాధించింది. ఆమె జీవితంపై ఒక బయోపిక్ తీస్తే నిజంగా పెద్ద హిట్ అవుతుంది. ఆమె కథ నేటితరం నటీనటులకు ఎంతో నేర్పే అవకాశం ఉంది. సౌందర్య ఎన్ని మంచి గుణాలు కలిగి ఉండి, మంచి వ్యక్తిత్వం కూడా ఉన్న నటి. ఇక ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె స్నేహితురాలు అయినా హీరోయిన్ ఆమనీ సైతం ” కుటుంబంతో కలిసి అందరు తమ సినిమాలు చూడాలి కాబట్టి గ్లామర్ పాత్రలు చేయాలని ఎప్పుడూ భావించలేదని సౌందర్య చెప్పినట్టు తెలిపింది”. ఆమె మరణం పరిశ్రమకు తీరని లోటు.

 

కీర్తి సురేష్ :
ప్రస్తుతం TFIలో ఉన్న ప్రముఖ నటీమణులలో కీర్తి సురేష్ ఒకరు. క్యారెక్టర్ బేస్డ్ పాత్రల కోసం ఆమె ఎక్కువగా ఆరాటపడుతుంది. ఆమె కెరీర్‌లో మహానటి బెస్ట్ ఎగ్జాంపుల్. మహానటి విడుదల తర్వాత ఆమె మరింత గొప్పగా చేయాలనీ పాత్రలను ఎంచుకుంటూ చేస్తుంది. మిస్ ఇండియా వంటి సినిమా ఆమె సన్నబడటానికి ఒక కారణం అని చెప్పవచ్చు. ఆమె మాట్లాడుతూ “నేను స్లిమ్‌గా కనిపించాలని, అప్పుడే ఎలాంటి డ్రెస్ అయినా నాకు సరిపోతుందని మిస్ ఇండియా దర్శకుడు నాకు చెప్పారు. మంచి ఫిజిక్ ఉండాలి కానీ చూపించాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం” అంటూ కీర్తి సురేష్ తెలిపింది.

సాయి పల్లవి :
ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో సాయి పల్లవి ఒక్కసారిగా క్రేజ్ వచ్చిందని చెప్పచు. అయితే, ఫిదా తర్వాత తెలుగు ప్రేక్షకులు ఆమె డ్యాన్స్ మరియు నటన కు నిజంగానే ఫిదా అయ్యారు. నేటికీ ఫిదాలో చిన్న టౌన్‌గా ఉన్న ఆమె పక్కింటి అమ్మాయిలా ప్రేక్షకులను ఆమె మెస్మరైజ్ చేస్తుంది. ఒకసారి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, “గ్లామర్ పాత్ర చేయడం నా అభిమానులకు మరియు నాకు కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది. నాకు నచ్చకపోతే, లైన్ క్రాస్ చేసినట్టు అనిపిస్తే, నేను దానిని సున్నితంగా తిరస్కరిస్తున్నాను. చిన్నచిన్న దుస్తులకు, గ్లామర్‌ పాత్రలకు నేనెప్పుడూ దూరం అని చెప్పింది..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news