Moviesఅనిరుధ్ హీరోయిన్ల‌ను కూడా వ‌ద‌ల‌డా... ఇంత దారుణంగా టార్చ‌ర్ పెడ‌తాడా..?

అనిరుధ్ హీరోయిన్ల‌ను కూడా వ‌ద‌ల‌డా… ఇంత దారుణంగా టార్చ‌ర్ పెడ‌తాడా..?

అనిరుధ్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తాడా..సుచీ లీక్స్‌లో ఏముంది..? కోలీవుడ్ మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 3 సినిమాలోని కొలవరి డీ అనే సాంగ్‌తో ఒక్కసారిగా సంచలనం సృష్ఠించిన ఈ యంగ్ టాలెంటెడ్ ఆ తర్వాత దాదాపు అందరు తమిళ స్టార్ హీరోల సినిమాలకి సంగీతం అందించే అవకాశాలు దక్కించుకున్నాడు.

అనిరుధ్ మ్యూజిక్ ఆల్బం సూపర్ హిట్ అయితే దాదాపు సినిమా సూపర్ హిట్ అని ఆడియన్స్ ఫిక్సైపోతారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ తర్వాత అంత హార్డ్ వర్క్ చేసేది అనిరుధ్ అంటూ కోలీవుడ్‌లో టాక్ ఉంది. నిజంగా తమిళంలో అంతగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు సాంగ్‌తో మరోసారి పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు.

ఈ సంగీత దర్శకుడు కేవలం తమిళ సినిమాలకే పరిమితం కాలేదు. మన తెలుగులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకి సంగీతం అందించాడు. కానీ, ఎందుకనో అనిరుధ్ తన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇక్కడ చేసిన సినిమాలు మ్యూజికల్‌గా సక్సెస్ సాధించలేదు. ఇదిలా ఉంటే, అనిరుధ్ మీద ఎప్పటినుంచో ఓ నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటుంది.

అదేమిటంటే హీరోయిన్స్‌తో అనిరుధ్ చాలా సన్నిహితంగా ఉంటాడని. అప్పట్లో శృతి హాసన్‌తో రొమాన్స్ చేశాడని ప్రచారం అయింది. ఆ మధ్య కీర్తి సురేష్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సుచీ లీక్స్‌లో కూడా అనిరుధ్ కొందరు సింగర్స్‌తో, హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూ ఉన్న పిక్స్ ఉన్నాయట. అప్పట్లో కొన్ని పిక్స్ కూడా లీకయ్యాయి.

ఇక ఆండ్రియాతో కూడా అత‌డికి ఎఫైర్ ఉంద‌న్న పుకార్లు వ‌చ్చాయి. ఇక మ‌రో స్టార్ హీరోయిన్‌కు బాగా డ‌బ్బింగ్ చెప్పే ఓ సింగ‌ర్‌తోనూ అత‌డు ఎఫైర్ న‌డిపించాడ‌ని అంటారు. దీన్నిబట్టే ఈ యువ సంగీత దర్శకుడు పలువురు హీరోయిన్స్‌తో బాగానే రొమాన్స్ చేస్తాడని చెప్పుకుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news