Moviesఆ రోజుల్లో మ‌రోచ‌రిత్ర స‌రిత డ‌బ్బింగ్‌కు ఇంత క్రేజా... షాకింగ్ నిజం...

ఆ రోజుల్లో మ‌రోచ‌రిత్ర స‌రిత డ‌బ్బింగ్‌కు ఇంత క్రేజా… షాకింగ్ నిజం ఇది…!

సరితా..హీరోయిన్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సౌత్ ఇండియాలో చాల పాపులర్. 500 కి పైగా సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో నటించిన సరితా 80 లలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆమె ఒక పక్క హీరోయిన్ గా వెలుగు వెలుగుతూనే మరో పక్క తన తోటి హీరోయిన్స్ కి గాత్ర దానం కూడా చేసింది. ఇలా హీరోయిన్‌గా తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్తూ చాల మంది బయట హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పడం అంటే మాటలు కాదు. ఒక్కరికో ఇద్దరికో చెప్పిన ఎవరు గుర్తు పట్టలేదు అనుకోవచ్చు కానీ ఏకంగా ఒక్కో తరంలో డజన్ మంది హీరోయిన్స్ కి పైగా డబ్బింగ్ చెప్పిన రికార్డు కేవలం సరిత పేరు పైన మాత్రమే ఉంది.

ఇక హీరోయిన్ గా ఆమె ఎంతో స్టార్డం చూసిన తర్వాత కొన్నాళ్ళకు ఆమె తన తోటినటుడు ముకేశ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు నటించిన ఆ తర్వాత హీరోయిన్స్ రోల్స్ రాకపోవడం తో ఆమె నటన నుంచి దూరం అయినా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రం ఆమె కెరీర్ ఎంతో చక్కగా దూసుకుపోయింది. 90’s మరియు 2000 దశకాల్లో కూడా ఆమె ఆ టైం హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది. సుహాసిని నుంచి మొదలు పెడితే రమ్యకృష్ణ, నగ్మా, విజయ శాంతి, టబు, సుష్మిత సేన్, సౌందర్య వంటి హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేది.

నటనలోను, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమె ఎన్నో అవార్డులను, రివార్డులను దక్కించుకున్నారు. ఇక ఆమె హీరోయిన్ గా ఎంతో సంపాదించుకున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రెండు చేతుల సంపాదించేది. ఇక ఆమె తన ఎరా లో ఎక్కువ పారితోషకం అందుకున్న హీరోయిన్ గానే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా బాగా కాస్టలీ అంటూ అందరు అనేవారు. అందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మంచు పల్లకి సినిమా షూటింగ్ లో జరిగిన ఒక సంఘటన గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఈ సినిమాలో హీరోగా చిరంజీవి నటించగా, హీరోయిన్ గా సుహాసిని నటించింది.

సుహాసిని తొలుత తమిళ సినిమాల ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆమె నటించిన ఒక సినిమా తెలుగు లో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు వరిజినల్ లో నటించిన సుహాసిని ని తెలుగు లో కూడా తీసుకోవాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు. కానీ ఇది ఆమెకు రెండో సినిమా మాత్రమే. దాంతో ఆమె డబ్బింగ్ మాత్రం చెప్పలేకపోయింది. అందుకే ఆమెకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాగా ఫెమస్ అయినా దుర్గ గారి చేత డబ్బింగ్ చెప్పించారు.

కానీ డబ్బింగ్ పూర్తయ్యాక ఎందుకో ఆమె వాయిస్ సుహాసిని కి మ్యాచ్ అవ్వలేదు అని డైరెక్టర్ వంశీ కాస్త నిరాశ పడ్డాడు. దుర్గ ఎంతో ఫెమస్ అయినా కూడా ఆమె వాయిస్ సుహాసిని కి మాత్రం సెట్ కాలేదు. దాంతో అందరు సరిత చేత చెప్పిద్దాం అని అనుకున్నారు. కానీ ఆమె అప్పటికే డబ్బింగ్ కోసం 10 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఆ టైంలో సినిమాలో హీరోగా నటించిన చిరంజీవి కి 70 వేల రూపాయల పారితోషకం ఉంటె దర్శకుడు అయినా వంశీ కి మాత్రం కేవలం నెలకు 650 రూపాయల పారితోషకం మాత్రమే ఉంది.

కానీ కేవలం డబ్బింగ్ కోసమే 10 వేలు ఇస్తే ఎలా అని భయపడ్డాడు వంశీ. ఎలాగోలా అందుచేతనే డబ్బింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేయగా అది కాస్త నిరాశపరిచింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు సరిత రేంజ్ ఆ రోజుల్లో ఎలా ఉండేదో చెప్పడానికి. ఇక ఇప్పుడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి ఆమె ప్రస్తుతం దుబాయ్ లో తన కొడుకులతో ఉంటుంది. ఆమె ఇద్దరు పిల్లలు అక్కడే జాబ్ చేస్తూ సెటిల్ అవ్వడం తో రెండో భర్త అయినా ముకేశ్ నుంచి విడిపోయి కొడుకులతో ఒంటరిగానే ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news