Moviesనా కవల పిల్లల సీక్రేట్ ..ఆ తెలుగు డైరెక్టర్ కి అంత...

నా కవల పిల్లల సీక్రేట్ ..ఆ తెలుగు డైరెక్టర్ కి అంత తెలుసు..సంచలన మ్యాటర్ ని లీక్ చేసిన నయనతార..!!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నయనతార ప్రజెంట్ సౌత్ లోనే క్రేజీయస్ట్ హీరోయిన్గా ట్యాగ్ చేయించుకుంది. కాగా ఈ మధ్యనే స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార.. పెళ్లి అయిన నాలుగు నెలలకే ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయ్యి బిగ్ షాక్ ఇచ్చింది .

నయనతార సరోగసి ప్రాసెస్ ద్వారా పిల్లలు కనింది అంటూ అఫీషియల్ గా న్యూస్ కన్ఫర్మ్ అయింది . వీళ్ళ పెళ్లి టైం లో ఎంత హంగామా నడిచిందో ..అంతకంటే డబుల్ హంగామా నడిచింది . పెళ్లైన నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి రోజు చూసి “నేను నయనతార తల్లిదండ్రులయ్యాము ” అంటూ విగ్నేశ్ పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోని ఒక వారం రోజులు సోషల్ మీడియాలో నయనతార , విగ్నేశ్ ..ఇద్దరు పిల్లలకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి.

అంతేకాదు తమిళనాడు ప్రభుత్వం దానిపై సీరియస్ అయి సరోగసికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని ఆర్డర్స్ పంపించింది. ఈ క్రమంలోనే వాళ్ల పెళ్లి అయ్యి ఆరేళ్లు అవుతున్నట్లు .. తనకు ఏదో ప్రాబ్లం ఉన్న కారణంగానే ఇలా సరోగసికి ఫిక్స్ అయ్యారని చెప్పుకొచ్చారు ఈ జంట . కాగా ఇదే క్రమంలో నయనతార ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాలో ఓ సీన్లో నయనతారకు ఇద్దరు కవల పిల్లలు పుడతారని అప్పుడే చెప్పారు . ఇదే విషయాన్ని ఫన్నీ మీమ్‌స్ ట్రోల్ చేశారు జనాలు .

కాగా రీసెంట్గా యాంకర్ గా సుమతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నయన్. ఈ క్రమంలోనే అదుర్స్ మీమ్‌స్ చూపించగా..”నాకు కావాలి పిల్లలు పుడతారని ఆ డైరెక్టర్ కి , ఎన్టీఆర్ కి ముందే తెలుసేమో “అంటూ క్యూటుగా తనదైన స్టైల్ ఆన్సర్ ఇచ్చింది . ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ ఇంటర్వ్యూలు నయనతార తెలుగు హీరోస్ డైరెక్టర్స్ అందరి గురించి పాజిటివ్ గా చెప్పుకోరావడం హైలెట్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news