Moviesకోట్ల ఆస్తి ఉన్న రామ్..సునీత పేరు పై ఒక్క రూపాయి రాయకపోవడానికి...

కోట్ల ఆస్తి ఉన్న రామ్..సునీత పేరు పై ఒక్క రూపాయి రాయకపోవడానికి రీజన్ ఇదేనా..?

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ సునీత ఈ పేరు గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి జనాల మనసు దోచుకునింది. సునీత ప్రెసెంట్ రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా తన లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. మనకు తెలిసిందే సింగర్ సునీత మొదటి వివాహం ఎలాంటి సందర్భంలో బ్రేక్ అయిందో. కాగా అప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సునీత ..సొంత కష్టంతో తన బిడ్డలను పెంచింది. సింగిల్ ఉమెన్ కూడా బిడ్డలను పెంచగలరు అంటూ సమాజానికి నిరూపించింది.

సింగర్ సునీత మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకుంది . వీళ్ల పెళ్లి టైంలో హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది. సోషల్ మీడియాలో రామ్ వీరపనేని ని..సునిత ని హద్దులు మీరి ట్రోల్ చేసారు. అయితే ఇలాంటి ట్రోలింగ్స్ ని ఏ మాత్రం పట్టించుకోని సునిత-రామ్..హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ని కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో రామ్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే రామ్ సొంత కష్టం తో పైకి వచ్చిన టాలెంటెడ్ మనిషి. ఆయన టోటల్ ఆస్తి గురించి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే రామ్ వీరపనేని అసలు పేరు రామకృష్ణ వీరపనేని. ఈయన ఆస్ట్రేలియాలో ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి తిరిగి ఇండియాకి వచ్చి ప్రముఖ వ్యాపారవేత్తగా సెటిల్ అయ్యారు. ఈయనకు పలు కంపెనీలలో వందల కోట్ల రూపాయల షేర్స్ ఉన్నాయి. అంతేకాదు ప్రముఖ మ్యూజిక్ సంస్థ మ్యాంగో మీడియా కి ఈయనే సీఈవో ఉన్నారు. అంతేకాదు విదేశాలలోనూ పలు బిజినెస్ లు ఉన్నట్లు తెలుస్తుంది.

తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి బిజినెస్ పరంగా సంపాదించిన ఆస్తి దాదాపు 700 కోట్ల పైనే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే తన భార్య సునిత పేరు పై ఒక్క రూపాయి కూదా రాయలేదట. దానికి కారణం సునితనే అంటూ తెలుస్తుంది. డబ్బు కోసమే రామ్ ని పెళ్లి చేసుకుంది అని అందరు అనుకుంటారని..ఆమె రామ్ ఆసతి లో ఒక్క రూపాయి కూదా టచ్ చేయదట. ఏది ఏమైనా సరే కోట్ల ఆస్తి ఉన్న అంతకుమించిన అర్థం చేసుకునే భార్య సునీత పక్కన ఉండడం రామ్ అదృష్టం అంటున్నారు సునీత ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news