Moviesఈ ముగ్గురిలో బిగ్ బాస్ 7 హోస్ట్ గా ఎవ్వరు సెట్...

ఈ ముగ్గురిలో బిగ్ బాస్ 7 హోస్ట్ గా ఎవ్వరు సెట్ అవుతారు..గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి బాసూ..!!

తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ .. ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. కాగా త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం కానుంది . ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఇప్పటివరకు బిగ్ బాస్ మూడు సీజన్లోకి హోస్ట్ నాలుగు సీజన్లు నాగార్జున చేసారు. ఇకపై ఆయన ఈ షో ని హోస్ట్ గా చేసే వీలు లేదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . మనకు తెలిసిందే.. బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్టుగా చేసిన ఎన్టీఆర్ సీజన్ 2 కి చేసిన నాని ఎంత హ్యూజ్ టీఆర్పి రేటింగ్స్ తీసుకొచ్చారో.

కాగా ఆ తర్వాత హోస్ట్ గా చేస్తున్న నాగార్జున పర్లేదనిపించిన ..బిగ్ బాస్ సీజన్ సిక్స్ మాత్రమే దరిద్రమైన టిఆర్పి రేటింగ్స్ సంపాదించుకుంది . ఈ క్రమంలోనే బిగ్ బాస్ లో నాగార్జునను చూసి చూసి బోర్ కొట్టేసింది అని.. కొత్త హోస్ట్ కావాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు . కాగా ఇదే తరుణంలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోస్ట్ గా ముగ్గురు పేర్లు తెరపై హల్చల్ చేస్తున్నాయి. వాళ్ళల్లో మెయిన్ గా నందమూరి బాలకృష్ణ పేరు ఫిక్స్ అయినట్లు ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.

అంతేకాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ , దగ్గుబాటి వారసుడు రానా పేర్లు కూడా హల్చల్ చేస్తున్నాయి . కాగా ఈ ముగ్గురులో హోస్టుగా ఎవరు సెట్ అవుతారు అని జనాలు ఓ పోల్ ని కందెక్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఎక్కువగా బాలయ్యకు ఓట్లు వేస్తున్నారు జనాలు. మనకు తెలిసిందే అన్ స్టాపబుల్ షో తో ఆహాను ఓ రేంజ్ లో పైకి లేపాడు బాలయ్య . ఇదే క్రమంలో బాలయ్య బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోస్టుగా చేస్తే కచ్చితంగా ఇన్ని సీజన్స్ కి మించి పోయే టీఆర్పీలు సొంతం దక్కించుకోగలరు అన్న నమ్మకం ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు నందమూరి అభిమానులు. మరి మీరేమంటారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోస్ట్ గా ఈ ముగ్గురిలో ఎవరు సెట్ అవుతారు …బాలయ్య నా ..?విజయ్ దేవరకొండ నా..? రానా దగ్గుబాటి నా..? కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news