Moviesపెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. చప్పట్లు కొడుతున్న జనాలు..!!

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. చప్పట్లు కొడుతున్న జనాలు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తమదైన స్టైల్ లో నటించి అలరించారు. కానీ వాళ్ళల్లో కొంతమందిని అభిమానులు యాక్సెప్ట్ చేసి స్టార్ హీరోయిన్గా ..తమ మనసులో చెరగని స్థానాన్ని ఇచ్చారు. అలాంటి వాళ్ళల్లో ఒకరే ఈ ఐశ్వర్య రాజేష్ . పెద్దగా అందగత్తె కాదు కానీ నటనలో మాత్రం ఇప్పుడున్న హీరోయిన్స్ కి ఏం మాత్రం తీసిపోదు ఎలాంటి రోల్స్ నైనా సరే అవలీలగా నటించి మెప్పించగల ఐశ్వర్య రాజేష్ ..వరలడ్ ఫేమస్ లవర్ తో పాపులారిటీ సంపాదించుకుంది .

అంతేకాదు కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతో మంచి పాజిటివ్ రివ్యూలు అందుకుంది .ఇక తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమా ద్వారా ఐశ్వర్య రాజేష్ ఎంతటి గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అంతేకాదు ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఐశ్వర్య రాజేష్.. హిట్ కొట్టకపోయినా సరే జనాలు తమ మదిలో ఆమె బొమ్మను ముద్ర వేసుకున్నారు. కాగా ఢిఫరెంట్ కాన్సెప్ట్ లు చూస్ చేసుకోవడం లో..ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉండే ఐశ్వర్య రాజేష్ నెల్సన్ వెంకటేశ్ డైరెక్షన్ లో రాబోతున్న ఫరానా సినిమాలో ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించబోతుంది . ఇంత చిన్న ఏజ్ లోనే ఇలాంటి రోల్ కు యాక్సెప్ట్ చేసిన ఐశ్వర్య రాజేస్ కి జనాలు హాట్సాఫ్ చెప్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం ప్రకాష్ ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో నటుడు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కాగా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకోవడంలో ఐశ్వర్యరాజేష్ గ్రేట్ అంటూ పొగడేస్తున్నారు జనాలు. చూడాలి మరి ఐశ్వర్య రాజేష్ కి ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news