Moviesవావ్: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన హీరో నాని.. న్యూ...

వావ్: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన హీరో నాని.. న్యూ ఇయర్ గిఫ్ట్ అద్దిరిరిపోయిందిగా..!!

మరికొద్ది గంటల్లో 2022వ సంవత్సరం ముగియనుంది . కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం . ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీస్ , స్టార్స్ అందరూ కొత్త లైఫ్ ను ఏ విధంగా ఎంజాయ్ చేయాలి.. ఏ విధంగా మార్పులు చేసుకోవాలి అంటూ పకడ్బందీగా ప్రణాళికను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ స్టార్స్ తమ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను రివిల్ చేస్తూ ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు . నేచురల్ స్టార్ నాని గెలుపోటములతో సంబంధం లేకుండా ..ఇండస్ట్రీలో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తున్న హీరో నాని ప్రజెంట్ దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు .

కాగా ఈ సినిమా తర్వాత నాని ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడా..? నెక్స్ట్ నాని ప్రాజెక్ట్ ఏంటా..? అంటూ జనాలు విపరీతంగా చర్చించుకుంటున్నారు. అయితే దసరా సినిమా చేసినప్పటి నుంచి నాని మీడియాతో పెద్ద గా మాట్లాడకపోవడంతో నాని ఇప్పట్లో సినిమా చేయడని ఫాన్స్ భావించారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా న్యూ ఇయర్ గిఫ్ట్ గా నాని తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేశాడు . కొద్దిసేపటికి క్రితమే నాని తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేశారు .

నెక్స్ట్ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాడు హీరో నాని . ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలను న్యూ ఇయర్ కానుకగా జనవరి ఒకటి సాయంత్రం నాలుగు గంటలు ఐదు నిమిషాలకు ప్రకటించనున్నట్లు తెలిపాడు. సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టుర్ ను రిలీజ్ చేశారు. దీని ఆధారంగా నాని ఈ సినిమాలో మరో నిన్ను కోరి సినిమాల ఉండబోతుంది అంటున్నారు జనాలు. చూడాలి మరి నాని ఏ కంటెంట్ తో ముందుకు రాబోతున్నాడో..? ఏదేమైనా సరే నాని న్యూ ఇయర్ గిఫ్ట్ అదిరిపోయింది అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news