Moviesబంగారం లాంటి గోపీచంద్ హీరో భవిష్యత్తుని.. నాశనం చేసింది ఆ డైరెక్టరే..!!

బంగారం లాంటి గోపీచంద్ హీరో భవిష్యత్తుని.. నాశనం చేసింది ఆ డైరెక్టరే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. దానికి ఎన్నో సందర్భాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు . అందులో ఒకరే స్టార్ హీరో గోపీచంద్. సినిమా ఇండస్ట్రీ లోకి “తొలివలపు ” అనే సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్ ఎవరో కాదు అలనాటి డైరెక్టర్ టి కృష్ణ కొడుకు . ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . నాన్న డైరెక్టర్ కావడంతో ఇండస్ట్రీలోకి ఈజీగానే హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ..మొదటి సినిమాతోనే మంచి నటుడు అన్న ట్యాగ్ ని వేయించుకున్నాడు . ఇక ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న గోపీచంద్ కి.. సడన్గా సినిమా అవకాశాలు ఆగిపోయాయి.

ఈ క్రమంలోనే డైరెక్టర్ తేజ అతని వద్దకు నెగిటివ్ రోల్స్ ఉన్న జయం సినిమా పాత్రను తీసుకెళ్లాడు . ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు లేక దిగులుగా ఉన్న గోపీచంద్ కు అప్పట్లో అదే అమృతంలా అనిపించింది . ఈ క్రమంలోనే ముందు వెనక ఆలోచించుకోకుండా ఆ సినిమాని యాక్సెప్ట్ చేశాడు . జయం సినిమాలో గోపీచంద్ నటించిన నటన కు అభిమానులు ఫిదా అయ్యారు. ఆయనను విలన్ గానే చూడాలనుకుంటున్నాం అనేంతలా ఆ సినిమా చేసుకున్నాడు.

ఇక తర్వాత వర్షం, నిజం లాంటి సినిమాలలో విలన్ గా చేసి మంచి మార్కులు వేయించుకున్నాడు . అయితే ఎక్కడో తనకి హీరో అవ్వాలన్న కోరిక గుర్తొచ్చింది . ఈ క్రమంలోనే విలన్ గా చెక్ పెట్టి మళ్ళీ హీరోగా ట్రై చేశాడు. హీరోగాను సక్సెస్ అయ్యాడు . గత కొంతకాలం నుంచి గోపీచంద్ కెరియర్లో సరైన హిట్స్ లేక అల్లాడుతున్నాడు . అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. ఒకే విధంగా ఫ్యాన్ బేస్ ని మెయింటైన్ చేస్తున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకైక హీరో గోపీచంద్ అనే చెప్పాలి . ఇలా తనకు తెలియకుండానే గోపీచంద్ హీరో భవిష్యత్తును నాశనం చేశాడు డైరెక్టర్ తేజ అంటూ పలువురు గోపీచంద్ ఫాన్స్ మండిపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news