Moviesశ్రీహాన్ అందుకు వేస్ట్.. మోసగాడు.. ఊసరవెల్లి.. నిజమేనా.. ?

శ్రీహాన్ అందుకు వేస్ట్.. మోసగాడు.. ఊసరవెల్లి.. నిజమేనా.. ?

భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన బిగ్బాస్ సీజన్ 6 మరికొన్ని వారాల్లో తుది దశకు చేరుకోనుంది. ఈ క్రమంలోని హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఫైర్ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. లాస్ట్ మూమెంట్లో కప్ ఎలాగైనా కొట్టాలి అని టాప్ ఫైవ్ లో ఎలాగైనా ప్లేస్ ఎక్కించుకోవాలని కంటెస్టెంట్స్ కసి మీద ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 6 టిఆర్పి రేటింగ్స్ పుంజుకున్నాయి. ఇదే క్రమంలో నాగార్జున సైతం టీఆర్పీలను మరింత పెంచటానికి కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

రీసెంట్గా జరిగిన ఎపిసోడ్లో నాగార్జున కాంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టే విధంగా కన్ఫెషన్ రూంలోకి పిలిచి మిగతా కంటెస్టెంట్లకు మీకు మధ్య ఉన్న తేడాని వివరించమని చెప్పడం షోలో హైలెట్గా మారింది . అంతేకాదు ఇదే క్రమంలో తన బెస్ట్ ఫ్రెండ్ రేవంత్ పై శ్రీహాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . నాగార్జున మాట్లాడుతూ..” రేవంత్ కన్నా నువ్వు ఎందులో బెటర్.. ఎందుకు హౌస్ లో ఉండాలి అనుకుం టున్నావు” అని శ్రీహన్ ని అడగ్గా ..”రేవంత్ తన తప్పుని తెలుసుకోలేడు ..చెప్పిన దాన్ని యాక్సిప్ట్ చేయడు.. నా విషయంలో అలా కాదు నేను యాక్సెప్ట్ చేస్తాను: అంటూ చెప్పుకోరావడంతో రేవంత్ ఫేస్ మాడిపోయింది .

అంతేకాదు ఒక్కసారిగా ఇలాంటి వాడా నా ఫ్రెండ్ అంటూ చూసిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అంతేకాదు రేవంత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు . అతడు మనిషి వెనకాల మాట్లాడతాడు అన్న సంగతి అందరికీ తెలుసు సార్ అంటూ అతని కోపాన్ని బయటపెట్టేసారు . ఇదే క్రమంలో రేవంత్ శ్రీహన్ ల మధ్య చిచ్చు పెట్టాడు నాగార్జున అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . రేవంత్ ఫ్యాన్స్ శ్రీహన్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారు.

ఒకప్పుడు సిరి ఆ తర్వాత సిరి హౌస్ లో ఉండగా ఎవరితోనో రొమాన్స్ చేసావ్ .. హౌస్ లోకి వెళ్ళాక శ్రీ సత్య తో రొమాన్స్ నీ ఆటలు ఎవరికి తెలియవు.. మాయగాడివి అంటూ ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఇవాళ చీటర్ అయ్యావ్.. ఫ్రెండ్ గురించి ఎవ్వరైన అలా చెప్తారా అంటూ ఫ్రెండ్షిప్ కి ఉన్న వాల్యూ తీసారు అంటూ ఆయనపై మండిపడుతున్నారు . ఇదే క్రమంలో సోషల్ మీడియాలో శ్రీహన్ ని ట్రోల్ చేస్తున్న జనాభాలు లిస్ట్ ఎక్కువైపోయింది . ఏది ఏమైనా సరే సిరి సపోర్ట్ ఉండగా శ్రీహన్ కచ్చితంగా టఫ్ ఫైవ్ లో ఉంటాడు అన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news