Moviesఏంటీ..వర్ష అమ్మాయి కాదా..? అసలు విషయం బయట పెట్టేసిన జబర్ధస్త్ కమెడియన్..!!

ఏంటీ..వర్ష అమ్మాయి కాదా..? అసలు విషయం బయట పెట్టేసిన జబర్ధస్త్ కమెడియన్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు వర్ష – ఇమ్మానుయేల్ . జబర్దస్త్ లో వీళ్లు నటించే నటన ఆస్కార్ పెర్ఫార్మన్స్ కి మించిపోయే రేంజ్ లో ఉంటుంది అంటూ జనాలు ఫన్నీగా చెప్పుకొస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా ఇమ్మానుయేల్ ..వర్షతో నడిపించే లవ్ ట్రాక్స్ మొదట్లో బాగానే ఉన్నా రాను రాను అవి మరి ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయని షో ని మరింత దిగజార్చే విధంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హీరోయిన్ కి మించిపోయే ఫిజిక్ తో అందంతో అల్లాడిస్తున్న వర్షకు ఫేస్కి ఇమ్మానుయేల్ ఎలా సెట్ అవుతాడు అంటూ కొందరు వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ విషయాలను వీళ్ళు ఏం పట్టించుకోకుండా వీళ్ళ పని వీళ్ళు కానిస్తూ టీఆర్పీలను సంపాదించుకుంటున్నారు. మొన్న ఆ మధ్య స్కిట్లో భాగంగా వర్ష మెడలో తాళి కట్టేసిన ఇమ్మానుయేల్ఆ తర్వాత ఆమె బర్త్డేకి కాస్ట్లీ గిఫ్ట్ అంటూ బంగారు దుకాణానికి తీసుకెళ్లడం సంచలనంగా మారింది .

రీసెంట్గా స్కిట్లో భాగంగా వర్ష్ ని టార్గెట్ చేసాడు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్. స్కిట్లో డైలాగ్స్ మధ్యలో ఇమ్మానుయేల్ ను అమ్మాయి కాదు అంటూ నొక్కి చెప్పాడు . రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమో ఆధారంగా మరోసారి ఇమ్మానుయేల్ ..వర్ష అమ్మాయి కాదు అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు స్కిట్లో భాగంగా డైలాగు ఉందో లేదో తెలియదు కానీ ఇమ్మానుయేల్ ని మాత్రం అలా అనడంతో ఒక్కసారిగా వర్ష ఫేస్ మాడిపోయింది . ఈ విషయాన్ని ప్రోమోలో మనం బాగా గమనించొచ్చు. ఏది ఏమైనా సరే ఇమ్మానుయేల్ రాను రాను వర్ష పై మితిమీరిన కామెంట్స్ చేస్తున్నాడు అన్నది మాత్రం వాస్తవం అంటూ వర్ష ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news