Moviesమాస్ హీరో తో క్లాస్ బ్యూటీ..బాలయ్య కోసం పర్ఫెక్ట్ ఫిగర్ ని...

మాస్ హీరో తో క్లాస్ బ్యూటీ..బాలయ్య కోసం పర్ఫెక్ట్ ఫిగర్ ని పట్టిన అనిల్..!!

ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ జనవరి 12వ తేదీ కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. గత ఏడాది అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య..ఈ ఏడాది అభిమానులకు ఎలాంటి గుడ్ న్యూస్ అందించలేకపోయినా ..అన్ స్టాపబుల్ 2 తో కొత్త ఉత్సాహాన్ని అందించారు . కాగా 2023 వ సంవత్సరం స్టార్టింగ్ స్టార్టింగ్ నే అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించే విధంగా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ను ఇవ్వబోతున్నాడు నందమూరి బాలకృష్ణ .

మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరికెక్కిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్గా ఎక్కువ థియేటర్లో రిలీజ్ కాబోతుంది . సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలకు టాప్ ఫైట్ ఇవ్వబోతుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం సంక్రాంతి విన్నర్ గా బాలయ్య ముందు వరుసలో ఉన్నారు . కాగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించాడు నందమూరి బాలకృష్ణ .. కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో క్రేజీ సినిమాకు శ్రీకారం చుట్టారు.

కాగా ఈ సినిమా తండ్రి – కూతుర్ల సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా పలువురు ముద్దుగుమ్మలని చర్చించుకున్నా.. ఫైనల్ గా ప్రియాంక జ్వాలాకర్ సెట్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమాలో క్రేజీయస్ట్ బ్యూటీని భాగం చేయనున్నట్లు తెలుస్తుంది . నేషనల్ క్రష్ష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ఈ సినిమాలో బాలయ్యతో ఆడి పాడి అలరించనుంది అంటూ తెలుస్తుంది.

ఈ సినిమాల్లో రష్మిక ఐటెం సాంగ్ లో చిందులేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . బాలయ్య లాంటి మాస్ హీరో పక్కన క్లాస్ హాట్ బ్యూటీ రష్మిక మందన ఎగిరెగిరి స్టెప్పులు వేస్తే కుర్రాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవడానికి అంతు చిక్కడం లేదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే బాలయ్య సినిమాలో రష్మిక మందనను ఇన్వాల్వ్ చేయడం అనిల్ రావిపూడి ప్రమోషన్స్ లో స్ట్రాటజీ అంటున్నారు జనాలు. అసలే పలు వివాదాలతో రష్మిక మందన పేరు సోషల్ మీడియా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్న టైం లో ఇలా బాలయ్య సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news