Moviesప‌వ‌న్ - బాల‌య్య ఎపిసోడ్‌లో ఊహించ‌ని గెస్ట్‌... మైండ్ పోయే ట్విస్ట్...

ప‌వ‌న్ – బాల‌య్య ఎపిసోడ్‌లో ఊహించ‌ని గెస్ట్‌… మైండ్ పోయే ట్విస్ట్ రా ఇది..!

న‌ట‌సింహం బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న ఆహా అన్‌స్టాప‌బుల్ షో ఇప్పుడు పీక్స్ టైంలో ఉంది. రెండో సీజ‌న్లో ఒక‌టి కాదు రెండు మూడు మైండ్ బ్లాక్ అయ్యే ఎపిసోడ్‌లు త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ముందుగా న్యూ ఇయ‌ర్ కానుక‌గా యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో బాల‌య్య చేసిన ఇంట‌ర్వ్యూ స్ట్రీమింగ్ కానుంది. ఆ వెంట‌నే సంక్రాంతికి కాస్త అటూ ఇటూగా మ‌రో రెండు ఇంట్ర‌స్టింగ్ ఎపిసోడ్లు రానున్నాయి.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – బాల‌య్య ఎపిసోడ్ మంగ‌ళ‌వార‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అస‌లు బాల‌య్య‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి టాక్ షో చేయ‌డ‌మే పెద్ద సంచ‌ల‌నం అనుకుంటోన్న వేళ ఈ ఎపిసోడ్‌లో చాలా ఊహించ‌ని ట్విస్టులు ఉండ‌బోతున్నాయ‌ని టాక్ ? ప‌వ‌న్ ప్ర‌స్తుతం చేస్తోన్న హరిహ‌ర వీర‌మ‌ల్లు ద‌ర్శ‌కుడు క్రిష్ కూడా ఈ షోలో గెస్టుగా చివ‌ర్లో క‌నిపించ‌బోతున్నాడు.

అయితే ఈ ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్ కూడా ఉండ‌బోతోంద‌ట‌. ఆ ట్విస్ట్ ఏంటో తెలిస్తే ఖ‌చ్చితంగా మైండ్ బ్లాక్ అయిపోవ‌డం ఖాయం. ఈ ఎపిసోడ్ చివ‌ర్లో బాల‌య్య త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. అస‌లే ప‌వ‌న్‌.. అటు బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ కూడా ఎపిసోడ్‌కు వ‌స్తే అస‌లు అది అలాంటి.. ఇలాంటి ఎపిసోడ్ అవ్వ‌దు.

సినీ అభిమానులందూ ఈ ఎపిసోడ్‌ను ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తారో చెప్ప‌క్క‌ర్లేదు. అలాగే భ‌విష్య‌త్తులో రెండు వైరి వ‌ర్గాల‌కు చెందిన కాంపౌండ్ హీరోల అభిమానులు కూడా క‌లిసి సినిమాల‌ను ఎంజాయ్ చేస్తారు. ఏదేమైనా బాల‌య్య అన్‌స్టాప‌బుల్ ఇండ‌స్ట్రీలో చాలా మందిని క‌లుపుతోంది.. దూరంగా ఉన్న వాళ్ల‌ను ద‌గ్గ‌ర చేస్తోంద‌న్న‌ది నిజం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news