Moviesపవన్ ఆమెకు దెబ్బేశాడు... ముందే బాల‌య్య‌తో చేసి ఉంటే ఆ హీరోయిన్...

పవన్ ఆమెకు దెబ్బేశాడు… ముందే బాల‌య్య‌తో చేసి ఉంటే ఆ హీరోయిన్ లెవ‌లే మారిపోయేదా…!

పవన్ కళ్యాణ్..పవర్ స్టార్‌గా ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒక్క పాన్ ఇండియా చేయకపోయినా ఆ స్టార్ డం ఎప్పుడో వచ్చేసింది. ప్రభాస్‌ను మించిన క్రేజ్ పవన్ కళ్యాణ్ సొంతం. ఎన్ని ఫ్లాపులొచ్చినా పవన్ సినిమా కొత్తది వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద ఉండే అరాచకం అంతా ఇంతా కాదు. అయితే, పవన్ సరసన హీరోయిన్‌గా నటించిన వారికి మాత్రం ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ దక్కలేదు. చాలా తక్కువమందే పవన్ సరసన హీరోయిన్‌గా నటించి సక్సెస్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ సరసన మొదటి సినిమా చేసి ఇండస్ట్రీకి పరిచయమైన వారు అతికొద్ది కాలంలోనే కనుమరుగైపోయారు. రేణు దేశాయ్, దేవయాని, ప్రీతి జింగానియా, కీర్తి రెడ్డి లాంటి వారు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ముఖ్యంగా ప్రీతి జింగానియా గురించి చెప్పుకుంటే అమ్మడు టాలీవుడ్ జనాలకి తగ్గ ఫిగర్ అని చెప్పాలి. నాజూకు అందాలతో అలరించే హీరోయిన్స్ అంటే మన వాళ్ళకి బాగా నచ్చుతుంది.

కానీ, ప్రీతి జింగానియా ఎందుకనో తమ్ముడు సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై మంచి హిట్ అందుకున్నా స్టార్ హీరోయిన్‌గా నిలబడలేకపోయింది. ఈ సినిమా తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చి భారీ కమర్షియల్ హిట్ సాధించిన నరసింహ నాయుడు సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించి అలరించింది. సిమ్రాన్, ఆశా శైని ఉన్నా ప్రీతి జింగానియా పర్ఫార్మెన్స్‌తో బాగా ఆకట్టుకుంది.

అదే బాలయ్య సినిమాతో సోలో హీరోయిన్‌గా గనక ప్రీతి జింగానియా పరిచయమై ఉంటే ఖచ్చితంగా పెద్ద కమర్షియల్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొంతకాలం కొనసాగేది. అదే పవన్ సినిమా కాబట్టి ఏదో అలా ఫ్లోలో కొట్టుకుపోయింది. అయితే, పవన్ సరసన నటించిన శృతి హాసన్ ఫ్లాప్ హీరోయిన్ అనే పేరు నుంచి బయటపడింది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత శృతి స్టార్ హీరోయిన్‌గా సెటిలయిన సంగతి తెలిసిందే. ఆ క్రెడిట్ పీకేకే చెందుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news