Moviesన‌ట‌సింహం బాల‌కృష్ణ - వ‌సుంధ‌ర పెళ్లి సంబంధం వెన‌క ఇన్ని ట్విస్టులు...

న‌ట‌సింహం బాల‌కృష్ణ – వ‌సుంధ‌ర పెళ్లి సంబంధం వెన‌క ఇన్ని ట్విస్టులు జ‌రిగాయా…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ వచ్చే సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అఖండ సినిమా తర్వాత బాలయ్య క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో చూస్తూనే ఉన్నాం. ఇటు బుల్లితెరపై అన్‌స్టాప‌బుల్ టాక్ షో తో వీర విహారం చేసి పడేస్తున్నాడు. ఇక బాలయ్య వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే కాకినాడకు చెందిన వసుంధరా దేవిని 1982లో వివాహం చేసుకున్నాడు.

ఎన్టీఆర్ – బసవతారకం దంపతుల ఐదో కుమారుడు బాలకృష్ణకు కాకినాడకు చెందిన దేవరపల్లి సూర్యారావు – ప్రమీలా రాణి దంపతుల ద్వితీయ కుమార్తె వసుంధర దేవితో బాలయ్య వివాహం ఎలా ?జరిగింది.. ఈ వివాహం కుదిర్చింది ఎవరు ? బాలయ్యకు మామ కుటుంబం నుంచి ఎంత కట్నం వచ్చింది ? బాలయ్య పెళ్లికి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు ? అన్న విషయాల వెనక ఆసక్తికర జవాబులు కనిపిస్తాయి. బాలకృష్ణ – వసుంధరా దేవి వివాహం 8 – 12 – 1982 బుధవారం పగలు 12 గంటల 41 నిమిషాలకు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధిలో కర్ణాటక కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా జరిగింది.

ఎన్టీఆర్ అప్పుడే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు. బాల‌య్య‌కు పెళ్లి చేసేయాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యారు. ఇదే విష‌యాన్ని అప్ప‌ట్లో ఆయ‌న‌కు స‌న్నిహితుడిగా ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర‌రావుకు చెప్పారు. ఆయ‌న కాకినాడ‌లో ఉన్న త‌మ బంధువుల అమ్మాయి వ‌సుంధ‌ర‌ను చూశారు. ఇక బాల‌య్య‌తో పాటు కుటుంబ స‌భ్యులు వ‌సుంధ‌ర‌ను చూడ‌డానికి వెళ్లారు. ముందుగా బాల‌య్య‌కో లేదా కుటుంబ స‌భ్యుల‌కో న‌చ్చ‌లేద‌ట‌.

చివ‌ర‌కు వీరంతా వెన‌క్కు వెళ్లిపోదామ‌ని డిసైడ్ అయ్యి కాకినాడ అవుట్ క‌ట్స్‌కు కూడా వెళ్లిపోయార‌ట‌. అప్పుడు ఎన్టీఆర్ ఫోన్ చేయ‌డంతో మ‌ళ్లీ వెన‌క్కు వెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని నాదెండ్ల భాస్క‌ర‌రావు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అప్ప‌ట్లోనే క‌ట్నంగా బాల‌య్య‌కు రు. 10 ల‌క్ష‌లు ఇచ్చార‌ట‌. ఎన్టీఆర్ ఈ రు. 10 ల‌క్ష‌ల‌తోనే హైద‌రాబాద్‌లో ఇప్పుడు ఉన్న ఇంటిని కొనుగోలు చేశార‌ట‌.

ఇక ఇప్పుడు బాల‌య్య – వ‌సుంధర పెళ్లి కార్డు వైర‌ల్ అవుతోంది. ఇప్పుడు నంద‌మూరి అభిమానులు, బాల‌య్య అభిమానులు ఆ పెళ్లి కార్డును సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ చేస్తున్నారు. ఆ పెళ్లి కార్డుపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news