Moviesఅన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ వేసుకున్న ఈ షర్ట్ కాస్ట్ తెలిస్తే...

అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ వేసుకున్న ఈ షర్ట్ కాస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంత స్పెషల్ అంటే..!

టాలీవుడ్ నటి సింహం నందమూరి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న షో అన్ స్టాపబుల్ . ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో..రెండో సీజన్ ని కూడా ఏ మాత్రం తగ్గేదేలే అనే విధంగా హోస్ట్ చేస్తూ బాలయ్య అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు .సీజన్ 2 కి మొదట సీజన్ కి రాలేని వాళ్ళని రప్పించే విధంగా బాలయ్య – అల్లు అరవింద్ ప్లాన్ చేశారు.

 

ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరో ప్రభాస్.. బాలయ్య అన్ స్టాప్ ఫుల్ షోకి వచ్చి సందడి చేశారు . దీనికి సంబంధించిన అఫిషీయల్ అప్ డేట్ ఆహా ఇచ్చింది. కాగా సోషల్ మీడియాలో లీక్ అయిన కొన్ని అన్ స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మరి ముఖ్యంగా పెదనాన్న చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇలా బయట కనిపించడంతో రెబల్ అభిమానులకి కొత్త బూస్టప్ ఇచ్చాయి.

చాలా సింపుల్ గా రెడీ అయి వచ్చాడు ప్రభాస్. ప్రభాస్ చూడడానికి చాలా హ్యాండ్ సమ్ లుక్ లో స్లిమ్ గా అదిరిపోయే కటౌట్ తో ఉన్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ షోలో చాలా సరదాగా ముచ్చటంచినట్లు కూడా తెలుస్తుంది . ఈ క్రమంలోనే ప్రభాస్ వేసుకున్న షర్ట్ మరింత హైలెట్ గా మారింది. లెమన్ ఎల్లో ఆరెంజ్ వైట్ గ్రీన్ చెక్స్ షర్ట్ వేసుకున్న ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ షర్ట్ ఖరీదు 11,700 అని తెలుస్తుంది . అంతేకాదు ఈ స్పెషల్ డ్రెస్ ని ప్రభాస్ కి ఎంతో ఇష్టమైన తన ఫ్రెండ్ గోపీచంద్ గిఫ్టుగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే ప్రభాస్ బాలయ్య ఇద్దరు బడా హీరోలను ఒకే తెరపై చూస్తూ ఉంటే ఆ కిక్కే వేరు అంటూ రెబెల్ – నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి వీళ్ళిద్దరి ఎపిసోడ్ కి సంబంధించిన టీఆర్పీలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news