Moviesనాని - ఎన్టీఆర్ - అడ‌వి శేష్‌... ఏ టాలీవుడ్ హీరోకు...

నాని – ఎన్టీఆర్ – అడ‌వి శేష్‌… ఏ టాలీవుడ్ హీరోకు లేని గొప్ప రికార్డ్ బ్రేక్ చేసిప‌డేశారుగా…!

టాలీవుడ్‌లోనే కాదు ఏ సినిమా రంగంలో ఎంత పెద్ద స్టార్ హీరోలు అయినా కూడా ఒక‌టి రెండు కాదు.. వ‌రుస‌గా ఆరు హిట్లు కొట్ట‌డం అంటే మామూలు విష‌యం కాదు. కానీ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఆరు వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. టెంప‌ర్ సినిమాకు ముందు వ‌ర‌కు ఎన్టీఆర్‌కు అన్నీ ప్లాపులే. టెంప‌ర్ త‌ర్వాత వ‌రుస‌గా టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ – జై ల‌వ‌కుశ – అర‌వింద స‌మేత‌వీర‌రాఘ‌వ – త్రిబుల్ ఆర్ సినిమాతో వ‌ర‌సగా ఆరు సూప‌ర్ హిట్లు ఎన్టీఆర్ ఖాతాలో ప‌డ్డాయి.

ఇలా ఎన్టీఆర్ కెరీర్‌లో వ‌రుస‌గా ఆరు హిట్లు, డ‌బుల్ హ్య‌ట్రిక్ హిట్లు ప‌డ్డాయి. ఈ త‌రం స్టార్ యంగ్ హీరోల్లో ఎవ్వ‌రికి ఇలాంటి అరుదైన రికార్డ్ లేదు. అయితే ఆరేడేళ్ల క్రితం నేచుర‌ల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్‌లో ఉన్న‌ప్పుడు కూడా ఆరు వ‌రుస హిట్ల‌తో అరుదైన రికార్డ్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంత‌కు ముందు కూడా నాని వ‌రుస‌గా పైసా నుంచి జెండా పైక‌పిరాజు వ‌ర‌కు వ‌రుస‌గా ప్లాపులు ఎదుర్కొన్నాడు.

ఆ త‌ర్వాత ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం నుంచి వ‌రుస‌గా హిట్ల బాటప‌ట్టాడు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌, జెంటిల్‌మ‌న్‌, మ‌జ్ను, నేనులోక‌ల్ సినిమాలు వ‌రుస‌గా హిట్ అయ్యాయి. అలా నాని డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు. ఇక ఇప్పుడు మ‌రో యంగ్ టాలెంటెడ్ అడ‌వి శేష్ కూడా వ‌రుస‌గా ఆరు హిట్లు త‌న ఖాతాలో వేసుకుని అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్‌, నాని స‌ర‌స‌న చేరిపోయాడు.

ఇక శేష్ క్ష‌ణం, అమీతుమీ, గూఢ‌చారి, ఎవ‌రు, మేజ‌ర్‌, తాజాగా హిట్ 2 ఇలా వ‌రుస‌గా ఆరు హిట్లు కొట్టాడు. పైగా ఇందులో కొన్ని సినిమాల‌కు తానే స్వ‌యంగా క‌థ , స్క్రీన్ ప్లే కూడా ఇచ్చాడు. ఈ సినిమాలు క‌థ‌లు అన్నీ చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఏదేమైనా టాలీవుడ్‌కు మ‌రో యంగ్ టాలెంటెడ్ హీరోగా అడ‌వి శేష్ దొర‌క‌డం నిజంగా అదృష్టం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news