Moviesన‌మ్ర‌త‌తో డేటింగ్ చేసేట‌ప్పుడు మ‌హేష్ అన్ని చిలిపి ప‌నులు చేసేవాడా...!

న‌మ్ర‌త‌తో డేటింగ్ చేసేట‌ప్పుడు మ‌హేష్ అన్ని చిలిపి ప‌నులు చేసేవాడా…!

టాలీవుడ్‌లో తిరుగులేని రొమాంటిక్ క‌పుల్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, ఆయ‌న భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌. వీరిద్ద‌రివి వేర్వురు నేప‌థ్యాలు అయినా ఎంచ‌క్కా ప్రేమ‌లో ప‌డి పెళ్లి జీవితం ఎంజాయ్ చేస్తున్నారు. న‌మ్ర‌త నార్త్ ఇండియ‌న్‌.. మాజీ మిస్ ఇండియా.. హిందీ అమ్మాయి.. ఆమె రిలీజీయ‌న్ వేరు. మ‌హేష్ టాలీవుడ్‌లో పేరున్న ఘ‌ట్ట‌మ‌నేని వార‌సుడు.. ఇక్క‌డ ఎంతో మంది అభిమానులు ఉన్న సూప‌ర్‌స్టార్‌.

2000లో వంశీ సినిమా షూటింగ్ టైంలో ఆస్ట్రేలియాలో వీరిద్ద‌రి మ‌న‌స్సులు క‌లిశాయి. అలా ప్రేమ‌లో ప‌డ్డారు. ఐదేళ్ల పాటు వీరు సీక్రెట్‌గా ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. వ‌య‌స్సులో న‌మ్ర‌త మ‌హేష్ కంటే పెద్ద‌ది. అయితే అవేవి వీరి ప్రేమ‌కు అడ్డు రాలేదు. పెళ్లి చేసుకుని 17 ఏళ్లుగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీరు ప్రేమ‌లో ప‌డ్డాక చాలా రోజుల వ‌ర‌కు ఎవ్వ‌రికి తెలియ‌దు.

అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీలో కొన్ని గుస‌గుస‌లు ఉన్నా… అదంతా ప్రేమ వ‌ర‌కే మ‌హేష్‌.. నిజంగా నమ్ర‌త‌ను పెళ్లి చేసుకోడ‌నే అంద‌రూ అనుకున్నారు. మూడేళ్ల పాటు వీరు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నారు. మ‌హేష్ ఎవ్వ‌రికి తెలియ‌కుండా సీక్రెట్‌గా న‌మ్ర‌త కోసం ముంబై ఫ్లైట్‌లో వెళ్లి వ‌చ్చేవాడు. సినిమా షూటింగ్‌లో గ్యాప్ వ‌చ్చినా, వీకెండ్ డేస్‌లో కూడా మ‌నోడు ముంబై చెక్కేసేవాడ‌ట‌.

ముంబై వెళ్లి అక్క‌డ సీక్రెట్‌గా ప్లాట్‌లో ఉండ‌డంతో పాటు ముంబైలో ఎవ్వ‌రికి క‌న‌ప‌డ‌కుండా చ‌క్కెర్లు కొట్టేవార‌ట‌. అయితే ఎప్పుడూ కూడా వీళ్లు హైద‌రాబాద్‌లో క‌న‌ప‌డ‌లేదు. మ‌హేష్‌.. న‌మ్ర‌త‌తో చేసిన ఎంజాయ్ అంతా ముంబైలోనే చేసేశాడు. ఇక న‌మ్ర‌త‌తో ఉన్న‌ప్పుడు ఎప్పుడూ ఆమెకు బోర్ కొట్టించే వాడు కాద‌ట‌. ఆమెను ఎప్పుడూ హ్యాపీగా ఉండేలా చూసుకునేవాడ‌ట‌.

ఇక చివ‌ర్లో మాత్రం వీరిద్ద‌రు ఎడ‌బాటు భ‌రించ‌లేక‌పోయారు. మ‌హేష్ సినిమాల షూటింగ్ విదేశాల్లో జ‌రుగుతుంటే న‌మ్ర‌త అక్క‌డ‌కు వెళ్లిపోయేద‌ట‌. ఆ టైంలో వీరిద్ద‌రి ప్రేమ గురించి చాలా మందికి క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ముందుగా ఈ ప్రేమ మ‌హేష్ అక్క మంజుల‌కు తెలిసింది. ఆమె కూడా ఇద్ద‌రికి బాగా కోప‌రేట్ చేసేద‌ట‌. చివ‌ర‌కు వారి పెళ్లికి కూడా మంజులే పెద్ద‌మ‌నిషిగా వ్య‌వ‌హ‌రించారు అన్న‌ది నిజం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news