Moviesఎక్స్ క్లూజీవ్: వరుస గా హీరోయిన్స్ జబ్బు లు పడటానికి కారణం...

ఎక్స్ క్లూజీవ్: వరుస గా హీరోయిన్స్ జబ్బు లు పడటానికి కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే బిగ్ బిగ్ హీరోయిన్స్ హీరోస్ అందరూ వరుసగా జబ్బులకు గురవుతున్నారు .మరీ ముఖ్యంగా హీరోస్ తో కంపేర్ చేస్తే హీరోయిన్స్ వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే అసలు హీరోయిన్స్ ఎందుకు ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు అని జనాలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే షాకింగ్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామరస్ ప్రపంచం. గ్లామరస్ గా కనపడకపోతే ఇక్కడ జనాలు పట్టించుకోరు . దానికోసం హీరోయిన్స్ కడుపు మాడ్చుకొని వాటర్ డైట్ అని , ప్లాంట్ బేస్డ్ డైట్ అని.. లిక్విడ్ డైట్ అని ఫాలో అవుతూ ఉంటారు.

మరి కొందరు హీరోయిన్స్ అసలు కడుపుకి అన్నం తినకుండా జీరో సైజ్ కోసం నాన్న రకాల డైటింగ్లు యోగాలు ఎక్సర్సైజులు చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు . అయితే ఏదైనా సరే లిమిట్స్ లో ఉంటే అది దేనికి ప్రాబ్లం కాదని ..లిమిట్స్ క్రాస్ చేస్తేనే అది అనారోగ్యం వరకు తెస్తుందని.. హీరోయిన్స్ డైటింగ్ చేసిన ..డైట్లు ఫాలో అయిన ..లిమిట్ గా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదని ..వేలు ఖర్చు చేసి వాటర్ తాగుతూ ..బాడీకి సరైన ప్రోటీన్స్ న్యూట్రీషియన్స్ ఫుడ్ లేకపోతే కచ్చితంగా ఇలాగే జరుగుతుందని చెప్పుకొస్తున్నారు.

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జబ్బులు పడిన హీరోయిన్స్ అందరూ అందం కోసం పాకులాడే వాళ్లే . మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే వాళ్లు పలు రకాల వ్యాధితో బాధపడుతున్నాము అంటూ చెప్పుకొచ్చిన ముద్దుగుమ్మలు అందరూ చూడడానికి చాలా చక్కగా ఉంటారు . కుందనపు బొమ్మల్లా ఉంటారు. పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు . అయితే ఏం లాభం అరుదైన వ్యాధితో బాధపడాల్సి వస్తుంది. కనీసం రాబోయే హీరోయిన్స్ అయినా ఫుడ్ కరెక్ట్ గా తీసుకొని ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరుకుందాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news