Moviesబ్రేకింగ్‌: స్టార్ క‌మెడియ‌న్ భార్య‌ ఆత్మ‌హ‌త్య‌

బ్రేకింగ్‌: స్టార్ క‌మెడియ‌న్ భార్య‌ ఆత్మ‌హ‌త్య‌

సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది వరుసగా ప్రముఖుల మరణాలు వెంటాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిచెందగా… ఆయన మరణ వార్త నుంచి కోలుకోకముందే ఇండస్ట్రీకి మరో పెద్ద షాక్ తగిలింది. నెలల వ్యవధిలోనే సూపర్ స్టార్ కృష్ణతో పాటు ఆయన భార్య ఇందిరాదేవి ఇద్దరు మృతి చెందారు. ఇటీవల కాలంలో కేజిఎఫ్ నటుడు కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రముఖులు మృతి చెందారు. ఈ వరుస విషాదాల పరంపరలో ఓ ప్రముఖ కమెడియన్ భార్య ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపింది. ప్రముఖ మలయాళ హాస్యనటుడు ఉల్లాస్ పండలం భార్య ఆత్మహత్య చేసుకున్నారు. కేరళలోని పత‌నంతిట్ట జిల్లా పండలంలోని వారి స్వగృహంలో ఆమె ఉరివేసుకొని చనిపోయింది. మృతురాలి పేరు స్వాతి కాగా.. వ‌య‌స్సు 38 సంవ‌త్స‌రాలు.

అయితే కమెడియన్ ఉల్లాస్ తన భార్య ఆశ కనిపించడం లేదని కేరళ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా అప్పటికే ఆమెకు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. ఉల్లాస్ ఇంట్లో ఉన్నప్పుడే ఆమె ఆత్మహత్య చేసుకుందన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఆమె చనిపోయే ముందు రోజు కూడా తన ఇంట్లోని మొదటి అంతస్తులో పిల్లలతో కలిసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news