Moviesబాల‌య్య రియ‌ల్ క్యారెక్ట‌ర్ ఇదే... ఏంటి సామీ రోజు రోజుకు ఈ...

బాల‌య్య రియ‌ల్ క్యారెక్ట‌ర్ ఇదే… ఏంటి సామీ రోజు రోజుకు ఈ అరాచ‌కం..!

టాలీవుడ్ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు కెరీర్‌లోనే ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అస‌లు బాల‌య్య జాత‌క గ్ర‌హాలు అన్నీ ఆయ‌న‌కు అనుకూలంగానే ఉన్న‌ట్టు ఉన్నాయి. బాల‌య్య ప‌ట్టింద‌ల్లా బంగారం అయిపోతోంది. వెండితెర‌పై అఖండ‌తో న‌ట విశ్వ‌రూపం చూపించేశాడు. ఆ సినిమా వ‌సూళ్ల ప‌రంగా బాల‌య్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. ఇటు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ షో ఫ‌స్ట్ సీజ‌న్ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌.

రెండో సీజ‌న్ కూడా సోష‌ల్ మీడియాను, బుల్లితెర‌ను ఊపేస్తోంది. అస‌లు ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ టాక్ షో అయ్యింద‌ని నిర్మాత అల్లు అర‌వింద్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. తాము ఈ షో ప్రారంభించిన‌ప్పుడు ఇది ఓ మంచి టాక్ షో అవుతుంద‌ని అనుకున్నామ‌ని.. అయితే ఇప్పుడు ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో అయ్యింద‌ని అర‌వింద్ గ‌ర్వంగా ప్ర‌క‌టించుకున్నారు.

ఇక త్వ‌ర‌లోనే బాల‌య్య అన్‌స్టాప‌బుల్ నుంచి ప్ర‌భాస్‌, ప‌వ‌న్ ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ‌, రాశీఖ‌న్నాల‌తో కూడా ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. న్యూఇయ‌ర్ నుంచి సంక్రాంతి వ‌ర‌కు వ‌రుస‌గా ఈ మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యి దుమ్ము రేప‌డంతో పాటు కావాల్సినంత ఎంట‌ర్టైన్‌మెంట్ ఇవ్వ‌నున్నాయి. అయితే ప‌వ‌న్ – బాల‌య్య ఎపిసోడ్ నిన్న షూటింగ్ జ‌రుగుతుండ‌గా ఓ అరుదైన సీన్ చోటు చేసుకుంది.

బాల‌య్య అల్లు అర‌వింద్‌తో పాటు మ‌రి కొంద‌రితో మాట్లాడుతుండ‌గా ఓ చిన్నారి పాప బాల‌య్యా అని ముద్దుగా జ‌నాల్లోనుంచి కేక వేసింది. వెంట‌నే అటు వైపు తిరిగిన బాల‌య్య ఆ పాను త‌న వ‌ద్ద‌కు తీసుకుర‌మ‌మ్మ‌ని వాళ్ల కుటుంబ స‌భ్యుల‌కు సైగ చేశారు. సెక్యూరిటీ వాళ్ల‌ను కూడా అడ్డుకోవ‌ద్ద‌ని సైగ‌లు చేయ‌డంతో పాటు పాప త‌న వ‌ద్ద‌కు వ‌చ్చాక‌… వివ‌రాలు క‌నుక్కుని గ‌ట్టిగా ముద్దు పెట్టి మ‌రీ పంపారు.

బాల‌య్య ఆ పాను పిలిచిన‌ప్పుడు ప‌క్క‌నే ఉన్న జ‌నాలు జై బాల‌య్యా అన‌డంతో పాటు బాల‌య్య రియ‌ల్ క్యారెక్ట‌ర్ ఇది అనుకోవ‌డం విశేషం. బాల‌య్య ప్రేమ ఎలా ఉంటుందో ? చెప్పేందుకు ఈ సీనే నిద‌ర్శ‌నం అని ఇప్పుడు సోష‌ల్ మీడియా అంతా హోరెత్తుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news