Moviesబ్రేకింగ్‌: టాలీవుడ్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు... బాల‌య్య - చిరు మ‌ల్టీస్టార‌ర్‌ సినిమా...!

బ్రేకింగ్‌: టాలీవుడ్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు… బాల‌య్య – చిరు మ‌ల్టీస్టార‌ర్‌ సినిమా…!

ఇది నిజంగానే టాలీవుడ్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించే న్యూస్‌. టాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాలుగా వేర్వేరు కాంపౌండ్‌ల‌కు ప్రాథినిత్యం వ‌హిస్తూ వృత్తిప‌ర‌మైన పోటీలో రైవ‌ల్‌గా ఉన్న చిరంజీవి, బాల‌కృష్ణ క‌లిసి న‌టిస్తే ఎలా ఉంటుంది.. అస‌లు ఆ కాంబినేష‌న్‌ను ఊహించుకోవ‌డానికే వేరేలా ఉంటుంది. చిరంజీవి, బాల‌య్య బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఒకేసారి త‌మ సినిమాల‌తో పోటీ ప‌డితేనే అస్స‌లు ఆ వార్ ఊహించుకోలేం. ఫ్యాన్స్ అయితే పెద్ద పెద్ద యుద్దాలే చేసుకుంటారు. వ‌చ్చే సంక్రాంతికి కూడా బాల‌య్య వీర‌సింహారెడ్డి, చిరు వాల్తేరు వీర‌య్య సినిమాలు ఢీ కొట్టుకుంటున్నాయి.

బాక్సాఫీస్ రైవ‌ల్రీని ప‌క్క‌న పెట్టి ఈ ఇద్ద‌రు హీరోలు ఒకే వేదిక మీద‌కు వ‌స్తే చూడాల‌ని కోరుకునే సినీ అభిమానులు కోట్ల‌లోనే ఉన్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య అల్లు అర‌వింద్ ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ టాక్ షోను హోస్ట్ చేస్తున్నాడు. ఈ షోకు గెస్ట్‌గా చిరంజీవి వ‌స్తే అంత‌కు మించిన ఆనందం ఉండ‌దు. ఇప్పుడు క‌నుక చిరు ఈ షోకు వ‌స్తే అటు వాల్తేరు వీర‌య్య‌, ఇటు వీర‌సింహారెడ్డి రెండు సినిమాల‌కు అంత‌కు మించిన ప్ర‌మోష‌న్ ఉండ‌ద‌నుకోవాలి.

తాజాగా ఈ షోలో అగ్ర నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, సురేష్‌బాబు, డైరెక్ట‌ర్లు కె. రాఘ‌వేంద్ర‌రావు, కోదండ రామిరెడ్డి సంద‌డి చేశారు. ఈ ఎపిసోడ్ రెండో ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో బాల‌య్య మ‌నిద్ద‌రి కాంబోలో సినిమా ఎప్పుడు అన్న ప్ర‌శ్న అర‌వింద్‌కు వేయ‌గా… చిరంజీవి, మీతో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయాల‌ని ఉంద‌ని త‌న మ‌న‌సులో మాట చెప్పారు. వెంట‌నే బాల‌య్య చిరంజీవి, తాను క‌లిసి న‌టిస్తే అది పాన్ వ‌ర‌ల్డ్ సినిమా అవుతుంద‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేశాడు.

ఈ ప్రోమో చూసిన వాళ్లంతా అల్లు అర‌వింద్ అంటే అన్నారు కాని.. నిజంగానే వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్ సెట్ చేస్తే అది ఊహ‌కే అంద‌నంత బాగుంటుంద‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే చిరు – బాల‌య్య క‌లిసి న‌టించేందుకు ఒప్పుకున్నా.. ప‌వ‌ర్ హౌస్ లాంటి ఈ ఇద్ద‌రు హీరోల‌ను బ్యాలెన్స్ చేస్తూ ద‌మ్మున్న క‌థ ఉండ‌దు.. అస‌లు చ‌ర‌ణ్ , ఎన్టీఆర్‌ల‌ను బ్యాలెన్స్ చేసి రాజ‌మౌళి చూపిస్తేనే ఫ్యాన్స్ చాలా కంప్లైంట్లు చేశారు. మ‌రి చిరు – బాల‌య్య‌ను బ్యాలెన్స్ చేసే ద‌మ్మున్న డైరెక్ట‌ర్ ఎవ‌రో ? కాలమే నిర్ణ‌యించాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news