Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ విల‌న్‌తో కూడా ట‌బు ఎఫైర్ న‌డిపిందా... అదంతా టాప్...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ విల‌న్‌తో కూడా ట‌బు ఎఫైర్ న‌డిపిందా… అదంతా టాప్ సీక్రెట్‌…!

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోలు, హీరోయిన్ల ఎఫైర్లు, హీరోయిన్లు-నిర్మాత‌ల ఎఫైర్లు కామ‌న్‌. అయితే ఒక్కోసారి హీరోయిన్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల ఎఫైర్లు, హీరోయిన్లు – విల‌న్ క్యారెక్ట‌ర్లు వేసే వారి ఎఫైర్లు మాత్రం చాలా స్పెష‌ల్‌గా ఉంటాయి. సీనియ‌ర్ న‌టి ట‌బు ఐదు ప‌దుల వ‌య‌స్సు దాటుతున్నా ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. ట‌బు హైద‌రాబాద్‌లో ఒంట‌రిగానే ఉంటూ జీవితం వెళ్ల‌దీస్తోంది.

ట‌బు స్వ‌స్థ‌లం హైద‌రాబాదే. ఆమె అక్క ఫ‌రా కూడా ఒక‌ప్ప‌టి టాప్ హీరోయిన్‌. అక్క బాట‌లో సినిమాల్లోకి వ‌చ్చిన ట‌బు ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో స‌క్సెస్ అయ్యి కూలీ నెంబ‌ర్ 1 సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్క‌డ కింగ్ నాగార్జున‌తో నిన్నే పెళ్లాడ‌తా సినిమా చేయ‌గా ఆ సినిమా సూప‌ర్ హిట్‌. ఆ త‌ర్వాత నాగ్‌తోనే మ‌రోసారి ఆవిడా మాఆవిడే సినిమా కూడా చేసింది.

ఆ టైంలో నాగ్‌తో డీప్ ల‌వ్‌లో ప‌డింద‌న్న‌ది టాలీవుడ్‌లో అంద‌రికి తెలిసిన సీక్రెట్టే. చాలా రోజుల పాటు ఆమె హైద‌రాబాద్‌కే ప‌రిమితం అయిపోయింద‌ని అంటారు. బాలీవుడ్‌లో మంచి ఫ్యూచ‌ర్ ఉన్నా కూడా నాగ్ మాయ‌లో ప‌డిపోవ‌డంతో ఆమె బాలీవుడ్ వైపు దృష్టి పెట్ట‌లేదు. 2000 ద‌శ‌కంలో మ‌ళ్లీ ఆమె హిందీలో సెటిల్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నాలు చేసింది. ఆ టైంలో ఆమె బాలీవుడ్‌లో విల‌న్‌గా వేషాలు వేస్తోన్న మ‌నోజ్‌బాజ్‌పాయ్‌తో ఒకే యేడాదిలో వ‌రుస‌గా రెండు సినిమాలు చేసింది.

2000లో ట‌బు – మ‌నోజ్ బాజ్పాయ్ కాంబినేష‌న్లో దిల్ పే మత్ లే యార్ – ఘాత్ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు నెల రోజుల తేడాలో రిలీజ్ అయ్యాయి. కేవ‌లం వీరిద్ద‌రి ఎఫైర్ కార‌ణంగానే తెర‌మీద కూడా కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను ఈ జంట‌కు వ‌రుస‌గా ఛాన్సులు ఇచ్చార‌న్న ప్ర‌చారం అయితే అప్ప‌ట్లో న‌డిచింది. ఆ త‌ర్వాత కూడా వీరి కాంబినేష‌న్లో మిస్సింగ్ సినిమా వ‌చ్చింది. అలా ఈ జంట మూడు సినిమాల్లో జోడీ క‌ట్టింది.

అప్ప‌ట్లో నేష‌న‌ల్ మీడియాలో కూడా ట‌బు – మ‌నోజ్ విష‌యం బాగా హైలెట్ అయ్యింది. మ‌నోజ్ కూడా ట‌బు అంటే ప‌డి చ‌చ్చేవాడ‌ని.. అందుకే అత‌డే స్వ‌యంగా త‌న సినిమాల‌కు ట‌బును రిక‌మెండ్ చేసేవాడ‌ని అంటారు. ఆ త‌ర్వాత మ‌నోజ్ తెలుగులో ప‌వ‌న్ కొమ‌రం పులి సినిమాలో విల‌న్‌గా కూడా న‌టించాడు. మ‌నోజ్‌తో వ‌రుస సినిమాలు చేసినా ట‌బు త‌ర్వాత బాలీవుడ్‌లో వ‌చ్చిన కుర్ర హీరోల తాకిడి త‌ట్టుకోలేక తిరిగి హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చేసింది.

ఇక అల వైకుంఠ‌పురంలో సినిమాతో సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన ట‌బుకు గ్రాండ్ స‌క్సెస్ ద‌క్కింది. ఇక ఇప్పుడు స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్ల సినిమాల్లో మంచి పాత్ర‌లు వ‌స్తే వేసేందుకు ట‌బు రెడీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news