Moviesబ్రేకింగ్: క్షీణించిన సమంత ఆరోగ్యం..హాస్పిటల్ కి తరలింపు..!?

బ్రేకింగ్: క్షీణించిన సమంత ఆరోగ్యం..హాస్పిటల్ కి తరలింపు..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం క్షీణించిందా అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . గత కొన్ని నెలలుగా సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి కారణంగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ తన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా యశోద ప్రమోషన్స్ కోసం తీవ్రస్థాయిలో కష్టపడింది .సమంత పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ తన ఆరోగ్యం బాగో లేకపోయినా.. లెక్క చేయని విధంగా సినిమాకు వీలైనంత బజ్ క్రియేట్ చేసింది .

ఈ క్రమంలోనే సమంత నటించిన యశోద బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకుంది . అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా సమంత హ్యూజ్ రేంజ్ లో ముందు వరుసలో ఉంది .కాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఆరోగ్యం మరింత క్షీణించిన్నట్లు.. ఈ క్రమంలోనే ఆమె హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వార్త ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.

యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హెల్త్ గురించి పట్టించుకోకుండా.. సమంత ఫుడ్ సరిగా తీసుకోలేదని ..ఈ క్రమంలోని నీరసించిపోయి.. కండరాల నొప్పి ఎక్కువైపోయి.. స్పృహ తప్పి పడిపోయిందని ..దీంతో సమంతని వెంటనే హాస్పిటల్ కి తరలించినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. అయితే దీనిపై సమంత కానీ ..ఆమె బంధువులు కానీ.. సమంత పి ఆర్ టీం కానీ స్పందించలేదు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news