Moviesఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ క్లాస్ లుక్.. ఏమున్నాడు రా...

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ క్లాస్ లుక్.. ఏమున్నాడు రా బాబు..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో సినిమాలు చేసి కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు గారు..పేరు చెప్పితే ఇప్పటికీ విజిల్స్ మారుమ్రోగిపోతాయి. ఆయన సినిమాలను.. ఆయన కుటుంబాన్ని ఇప్పటికి ఆరాధిస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. కాగా ఆయన పోలికలతో పుట్టిన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఫ్యాన్స్ అదేవిధంగా ఆరాదిస్తున్నారు.

అంతేకాదు తారక్ కూడా నటనలో మంచితనంలో తాతను మించిపోయే క్వాలిటీస్ ఉన్నాయి అంటూ చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు . అంతెందుకు ఈ మధ్యకాలంలో బిగ్ స్టార్స్ అందరూ కూడా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే టక్కున తడుముకోకుండా జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఓపెన్ గానే చెప్పేశారు . ఇండస్ట్రీని పైకి తీసుకెళ్లే సత్తా ఉన్న టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ..ఎలాంటి రోల్స్ నైనా సరే ..అలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా సరే ..అవలీలగా పలికిస్తూ ఫ్యాన్స్ ని సంతోష పెడుతున్నారు అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు సీనియర్స్.


కాగా ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. అంతే కాదు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశాడు తారక్. ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా కి ఫిక్స్ అయ్యాడు తారక్. కొరటాల శివ సినిమా పూర్తి అవ్వగానే ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ 30 సినిమా మరి కొద్ది రోజుల్లో అఫీషియల్ షూటింగ్ ప్రారంభం కానుంది అని తెలుస్తుంది .

కాగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదని బాధపడుతున్న ఫ్యాన్స్ కు .. తన క్రేజీ లుక్ ని రివీల్ చేసి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు. రీసెంట్గా రిలీజ్ అయిన తారక్ ఫోటో సోషల్ మీడియాని చెక్ చేస్తుంది . చాలా క్లాస్ లుక్ తో డిఫరెంట్ స్టైల్ లో అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రముఖ అడ్వర్టైజింగ్, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో తాజాగా ఎన్టీఆర్ న్యూ లుక్ ఫొటోను పంచుకున్నారు. మోనోక్రోమ్ పిక్చర్ లో బ్లాక్ సూట్ ధరించి, గ్లాసెస్ పెట్టుకొని తారక్ క్లాస్ గా అదరగొట్టారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news