Movies1980ల్లో సంచ‌ల‌నం రేపిన టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హ‌త్య‌... ఆ ఇద్ద‌రు...

1980ల్లో సంచ‌ల‌నం రేపిన టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హ‌త్య‌… ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌పై అనుమానాలు…!

డైరెక్టర్ రాజా చంద్ర ఈ తరం జనరేషన్ కు తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన డైరెక్టర్. పండంటి కాపురం – పండంటి సూత్రాలు, మెగాస్టార్ చిరంజీవితో మొండిఘటం లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. అప్పట్లో సీనియర్ డైరెక్టర్ గా ఉన్న విజయ బాపినీడు సైతం తాను సొంతంగా నిర్మించిన సినిమాలకు రాజా చంద్రనే డైరెక్టర్గా పెట్టుకునే వారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే రాజా చంద్రను 1987 అక్టోబర్లో మద్రాసులో నడిరోడ్డు మీద హత్య చేయటం అప్పట్లో సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ముందుగా చాలా రోజులపాటు దర్శిక రత్న దాసరి నారాయణరావు దగ్గర అసిస్టెంట్ గా చాలా సినిమాలకు పనిచేసిన రాజా చంద్ర ఆ తర్వాత విజయ బాపినీడు శిష్యుడిగా పనిచేశారు. అయితే అనంతలక్ష్మీ ఫిలిమ్స్ అధినేత భాస్కరరావు రాజా చంద్రలో ఉన్న దర్శకత్వ ప్రతిభను గుర్తించి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. అలా ఆయన బ్యానర్లో పండంటి కాపురం, పండంటి సూత్రాలు లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవితో మొండిఘటం కూడా హిట్ అయింది. దీంతో ఒక్కసారిగా రాజచంద్ర కెరియర్ పిక్స్ కు చేరుకుంది.

ఆయన స్వ‌స్థ‌లం ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లు. రాజాచంద్ర తన ప్రతి సినిమాలోను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న కృష్ణవేణికి అవకాశం ఇస్తూ వచ్చేవారు. అలా వారిద్దరి మధ్య సానిహిత్యం పెరిగింది. అప్పటికి రాజా చంద్రకు పెళ్లి అయ్యి భార్యతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. అయినా కృష్ణవేణిని ఆయన రెండో భార్యగా స్వీకరించారు. మొదటి భార్యకు ఇష్టం లేకపోయినా రాజాచంద్ర బలవంతంగా కృష్ణవేణి రెండో భార్య‌గా చేసుకున్నారని ప్రచారం అయితే అప్పట్లో జరిగింది.

ఇక చ‌నిపోయాక పోలీసులు మాత్రం పోస్టుమార్టంలో ఆయ‌న మెడ పిసికి చంపేశార‌ని తేల్చారు. అయితే ఆయ‌న చ‌నిపోయి 30 ఏళ్లు అవుతున్నా ఇప్ప‌ట‌కీ ఆయ‌న హ‌త్య ఎవ‌రు చేశారు ? అన్న‌ది పెద్ద మిస్ట‌రీగా ఉండిపోయింది. అయితే ఇది ఎందుకు జ‌రిగింది ? అన్న‌ది దాస‌రి నారాయ‌ణ‌రావుకు ఖ‌చ్చితంగా తెలిసే ఉంటుంద‌ని.. అయితే ఆయ‌న కూడా నోరు మెద‌ప‌లేద‌న్న టాక్ కూడా ఉంది.

అయితే కృష్ణ‌వేణి మాత్రం చాల రోజుల త‌ర్వాత త‌న భ‌ర్త హ‌త్య‌పై మాట్లాడుతూ అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఓ హీరోయిన్ ఇదంతా చేయించిందంటూ అనుమానం వ్య‌క్తం చేసింది. అయితే ఆ హీరోయిన్ పేరు మాత్రం చెప్ప‌లేదు. అయితే రాజాచంద్ర సినిమాల్లో ఎక్కువుగా విజ‌య‌శాంతి.. ఆ త‌ర్వాత మాధ‌వి మాత్ర‌మే న‌టించారు. ఆమె అనుమానం ఈ ఇద్ద‌రి మీద‌నా ? అన్న పుకార్లు కూడా వ‌చ్చాయి. అయితే మ‌రి కొంద‌రు మాత్రం కృష్ణ‌వేణి వైపు బంధువులే ఆయ‌న్ను చంపేశార‌ని అంటే.. మ‌రి కొంద‌రు మాత్రం మొద‌టి భార్య‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డంతో ఆమె త‌ర‌పు వాళ్లే ఈ హ‌త్య చేయించార‌ని కూడా అనుమానాలు వ్య‌క్తం చేశారు.

ఏదేమైనా అప్ప‌ట్లో టాప్ కెరీర్‌లో ఉన్న రాజాచంద్ర హ‌త్య ఈ రోజుకు మిస్ట‌రీగానే మిగిలిపోయింది. పైగా చంపేసి మ‌ద్రాస్ న‌డిరోడ్డులో వేయ‌డం ఇంకా ఘోరం. ఆయ‌న రెండో భార్య కృష్ణ‌వేణి ఇప్ప‌ట‌కీ సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఉన్నా ఆమె కూడా త‌న భ‌ర్త హ‌త్య‌పై నర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లే చేశారే త‌ప్ప అస‌లు విష‌యం ఏనాడు బ‌య‌ట పెట్టలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news